దాడులు చేస్తే వడ్డీతో సహా చెల్లిస్తాం | - | Sakshi
Sakshi News home page

దాడులు చేస్తే వడ్డీతో సహా చెల్లిస్తాం

May 5 2026 6:44 AM | Updated on May 5 2026 6:44 AM

తిరుపతి తుడా: ‘రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులపై రోజురోజుకూ అధికార పార్టీ కార్యకర్తలు, నేతల దాడులు అధికమయ్యాయి. దశరథరామిరెడ్డికి రెండు కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. తలపై తీవ్రంగా గా యపరిచారు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పోలీసులు మాత్రం దుండగులపై కేసులు పెట్టకుండా దశరథరామిరెడ్డిపైనే కేసు నమోదు చేశారు. అధికారపార్టీకి కొమ్ముకాయకుండా నిందితు లను గుర్తించి అరెస్ట్‌ చేయాలి’ అని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు హెచ్చరించారు. మంత్రి మండిపల్లె రామ్‌ప్రసాద్‌రెడ్డి అనుచరుల దాడిలో తీవ్రంగా గాయపడి తిరుపతిలో చికిత్స పొందుతున్న రాయచోటి మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ దశరథరామిరెడ్డిని సోమవారం సాయంత్రం వారు పరామర్శించారు. ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తప్పక అధికారంలోకి వస్తుందని, ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

దశరామిరెడ్డిపై కూటమి నేతలు విచక్షణా రహితంగా దాడిచేయడం దారుణమని వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తిరుపతిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను ఎమెమల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, పరామర్శించారు. అనంతరం వారు దశరథరామిరెడ్డి సతీమణిని కలిసి దాడికి సంబంధించిన విషయాలపై ఆరా తీశారు.

Advertisement
 
Advertisement
Advertisement