గంజాయి మత్తులో యువకుడిపై దాడి | - | Sakshi
Sakshi News home page

గంజాయి మత్తులో యువకుడిపై దాడి

May 5 2026 6:44 AM | Updated on May 5 2026 6:44 AM

మదనపల్లె టౌన్‌: గంజాయి మత్తులో ఓ యువకుడు తన ప్రత్యర్థిపై బీరు బాటిళ్లతో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అన్నమయ్య జిల్లాలో సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఘటనపై బాధితుడి కథనం.. తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దమండ్యం మండలం, తురకపల్లి కు చెందిన మహబూబ్‌ బాషా కుమారుడు షాబాన్‌ మొహిద్దిన్‌(25), ఇంటికి సమీపంలో ఉన్న మైదానానికి మధ్యాహ్నం వెళ్లాడు. అప్పటికే అక్కడ గంజాయి మత్తులో ఉన్న అదే ఊరికి చెందిన బాబు బుడన్‌ కొడుకు సయ్యద్‌ ఖదీర్‌ బీర్‌ బాటిల్‌ తెచ్చి పాత కక్షల కారణంగా షాబాన్‌ మొహిద్దినిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఇతన్ని స్థానికుల సాయంతో కుటుంబీకులు మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటూ ఉన్నాడు. పెద్దమడ్యం పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement