క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడిన ఐదుగురు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడిన ఐదుగురు అరెస్ట్‌

May 4 2026 7:43 AM | Updated on May 4 2026 7:43 AM

నిమ్మనపల్లె(మదనపల్లె టౌన్‌) : క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న టెకీ సహా ఐదుగురిని నిమ్మనపల్లె పోలీసులు అరెస్టు చేశారు. మదనపల్లె డీఎస్పీ పావని ఆదివారం సాయంత్రం మీడియాకు తెలిపిన వివరాలు.. మదనపల్లె నియోజకవర్గం లోని నిమ్మనపల్లె మండలానికి చెందిన కొందరు ఐపీఎల్‌ క్రికెట్‌ నేపథ్యంలో బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు అందిన పక్క సమాచారంతో ఎస్‌ఐ రామకృష్ణ సిబ్బందితో వెళ్లి పిట్టావాండ్లపల్లి వద్ద నిందితులను శనివారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారిని విచారించగా నేరం అంగీకరించారని చెప్పారు. పట్టుబడిన నిందితుల నుంచి రూ. 3,59,700 లక్షల నగదును సీజ్‌ చేశారు. నిమ్మనపల్లె దిగువ వీధికి చెందిన మహీంద్ర సింగ్‌ (33), వినయ్‌ కృష్ణ సింగ్‌ (30), అగ్రహారానికి చెందిన రెడ్డి ప్రసాద్‌ (26), దిగువపల్లి గంగా పురం సాయి కుమార్‌ (28), హేమంత్‌ సింగ్‌ (26) లను పట్టుకోవడంతో ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చిందన్నారు. మరో ఏడుగురు పరారీలో ఉన్నారన్నారు. వారిని కూడా త్వరలోనే అరెస్టు చేయనున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement