మదనపల్లె సిటీ : అభిమానులు సామాజిక,సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల ఆదరా భిమానాలు పొందాలని ప్రముఖ తెలుగు సినీ హీరో సప్తగిరి అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక శ్రీకృష్ణ కల్యాణమండపంలో హెల్పింగ్‌మైండ్స్ వార్షికోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హెల్పింగ్‌మైండ్స్ రక్తదాన శిబిరాలు, పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో హెల్పింగ్‌మైండ్స్ సంస్థ నిర్వాహకులు అబూబకర్‌సిద్దిక్,సభ్యులు పాల్గొన్నారు.
పడవ కాల్చివేత
లింగాల : లింగాల మండలం పార్నపల్లి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(సీబీఆర్) వద్ద ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు పడవను కాల్చివేశారు. డ్యామ్‌లో ఎవరు చేపలు పట్టకుండా.. గస్తీ తిరిగేందుకు కాంట్రాక్టర్ పడవను ఏర్పాటు చేశారు. మత్సకార సంఘానికి సంబంధించిన చిన్నకోట్ల, పెద్దకోట్ల, పార్నపల్లి గ్రామాలకు సంబంధించిన మత్స్యకారులకు చేపల కాంట్రాక్టర్ అయిన తెలంగాణ రాష్ట్రం నల్గొండకు చెందిన యాదగిరి ఒక గస్తీ పడవను మత్స్యకార సంఘానికి ఇచ్చారు. శనివారం రాత్రి దీనిని డ్యామ్ వద్ద ఉంచి మత్స్యకారులు ఇళ్లకు వెళ్లిపోయారు. అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు పాత ఆటో టైర్లను పడవలో వేసి నిప్పు పెట్టినట్లు మత్స్యకారులు తెలిపారు. ఆదివారం ఉదయం వద్దకు వెళ్లగా పడవ కాలిపోయిందని చెప్పారు.మత్స్యకార సంఘం సర్పంచ్ సూర్యనారాయణ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ బోటు విలువ సుమారు రూ. 4,70,000 ఉంటుందని ఆయన అన్నారు. లింగాల ఎస్‌ఐ జగదీశ్వర్ రెడ్డి సీబీఆర్ వద్దకు వెళ్లి పడవను పరిశీలించారు. సీబీఆర్‌పై ఉన్న సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్లే ఇలాంటి ఘటన జరిగిందని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.
సినీ హీరో సప్తగిరి


