తల్లడిల్లిపోతున్న తల్లిదండ్రులు | - | Sakshi
Sakshi News home page

తల్లడిల్లిపోతున్న తల్లిదండ్రులు

May 4 2026 7:43 AM | Updated on May 4 2026 7:43 AM

ఎర్రగుంట్లకు చెందిన శ్రీనివాసులుకు కుమారుడు సునీల్‌బాబు, ఒక కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం కుమారుడి వయస్సు 9 ఏళ్లు. తన కుమారుడికి కండరాల క్షీణత వ్యాధి సోకినట్లు నాలుగేళ్ల క్రితం తెలిసింది. అప్పటి నుంచి అతను చేయని ప్రయత్నమంటూ లేదు. నయం కాని వ్యాధి అయినా కుమారుడిపై మమకారంతో అనేక ఆస్పత్రులకు తీసుకెళ్లి చూపించినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రస్తుతం సునీల్‌బాబు మంచానికే పరిమితయ్యాడు. తన శక్తి మేరకు కుమారుడి వైద్యం కోసం ఖర్చు చేశాడు. పనికి వెళ్తే గానీ పూట గడవని పరిస్థితి వారిది. సునీల్‌బాబును ఇక ఎక్కడికీ తీసుకెళ్ల లేక వైద్యుల సూచన మేరకు ఇంట్లోనే ఉంచుకొని మందులు వాడుతున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement