ములకలచెరువు: కారు అదుపుతప్పి కల్వర్టుకు ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు... సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన చంద్రశేఖర్, నందిని, ఆదినారాయణమ్మలు కారులో తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు. దర్శనం ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో ములకలచెరువు షాదీమహల్ వద్దకు రాగానే కారు అదుపుతప్పి కల్వర్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జుగా మారింది. కారులోని చంద్రశేఖర్(36) నందిని((20), ఆదినారాయణమ్మ(56)లకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 సహాయంతో ములకలచెరువు పీహెచ్‌సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ చంద్రశేఖర్ మృతి చెందాడు. మిగిలిన ఇద్దరు చికిత్స పొందుతున్నారు.
ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు


