చౌడేపల్లె: మండలకేంద్రంలోని శ్రీఅభిష్టద మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారు హంస వాహనంపై విహరించారు. అర్చకులు రాజశేఖరధీక్షితులు, కుమారస్వామి, మహేష్‌లు ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు.అనంతరం హంస వాహనంపై కొలువుదీర్చి మేళ తాళాలు నడుమ పురవీధుల్లో ఊరేగించారు.ఈ కార్యక్రమానికి ఉభయదారులుగా బ్రాహ్మణసంఘంవారు వ్యవహరించారు.
మదనపల్లె టౌన్: మదనపల్లె పట్టణ శివారు కాలనీకి చెందిన ఓ బాలిక గత నెల 22న ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ప్రసవం విషయం గత గురువారం వెలుగులోకి రావడంతో డీఎస్పీ పావని స్పందించారు. బాలిక తల్లిదండ్రులతో మాట్లాడారు. గర్భానికి కారణమైన వారి పేరు చెప్పడానికి బాలిక కుటుంబీకులు నిరాకరించారు. ఈ క్రమంలో చైల్డ్‌వెల్ఫేర్ కమిషన్(సీడబ్ల్యూసీ) సూపర్ వైజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సమోటోగా తాలుకా పోలీస్ స్టేషన్ లో పెళ్లికాకుండానే బాలికను తల్లిని చేసిన నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఈ కేసులో పట్టణ శివారు కాలనీకి చెందిన ఓ యువకుడిన గురువారం సాయంత్రం బెంగళూరు రోడ్డులోని చిప్పిలి పాల డైరీ సమీపంలో డీఎస్పి అరెస్టు చేశారు. అనంతరం నిందితున్ని స్థానిక కోర్టులో హాజరపరచగా, న్యాయమూర్తి నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించారు.


