వైభవంగా అశ్వవాహన సేవ | - | Sakshi
Sakshi News home page

వైభవంగా అశ్వవాహన సేవ

Apr 30 2026 7:49 AM | Updated on Apr 30 2026 7:49 AM

చౌడేపల్లె: మండలకేంద్రంలోని బజారువీఽఽధిలో వెలసిన శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం స్వామివారి ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి అశ్వవాహనంలో కొలువుదీర్చారు. రాజశేఖర ధీక్షితులు, కుమార స్వామి పూజలు జరిపారు. అనంతరం మేళతాళాల ధ్వనుల మధ్య శివపార్వతుల ఉత్సవ మూర్తులు పురవీదుల్లో ఊరేగించారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఉభయదారులుగా అన్నం వంశస్థులు వ్యవహరించారు.

స్వర్ణ గ్రామం అందరి లక్ష్యం

కలకడ : స్వర్ణ గ్రామం మన అందరి లక్ష్యంగా పనిచేయాలని జిల్లా జీఎస్‌డబ్ల్యూఎస్‌ అధికారి అమరనాథరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని కదిరాయచెర్వు పంచాయతీలో విచారణ చేశారు. సిబ్బంది సచివాలయానికి సమయానికి హాజరు అవుతున్నారా, ప్రజలకు అందుబాటులో ఉన్నారా అని అడిగితెలుసుకున్నారు. సచివాలయ సిబ్బంది వ్యక్తిగతంగా అందిస్తున్న సేవలు, ఉన్నతాదికారులకు అందించే నివేదికలు ఎందుకు అధ్వానంగా ఉన్నాయని అడిగారు. అనంతరం కె.బాటవారిపల్లె పంచాయతీలో జనగణనపై జరుగుతున్న సర్వే తనిఖీ చేశారు. కార్యక్రమంలో డీప్యూటి ఎంపీడీఓలు చక్రపాణి, శ్రీనివాసులు, పంచాయతీ అభివృద్ధి అధికారులు విశ్వనాథ్‌, నందిని తదితరులు పాల్గొన్నారు.

అధికారి వైఖరికి నిరసన

మదనపల్లె టౌన్‌: వాణిజ్య పన్నుల శాఖ అధికారి వైఖరిని నిరసిస్తూ బుధవారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మదనపల్లెలో నిరసన తెలిపింది. రాష్ట్ర శాఖ ఆదేశాలతో మదనపల్లె వాణిజ్య పన్నులశాఖ అధిపతి బాబు అహ్మద్‌ వైఖరికి నిరసనగా, స్థానిక వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ ఉద్యోగుల సంఘం నాయకులు మాట్లాడుతూ.. ప్రమోషన్ల కోర్రీలు పెట్టడం, అవమాన కరంగా మాట్లాడటం, అసభ్య పదాలు వాడటం, ఉద్యోగులకు కించపరిచే విధంగా మాట్లాడారన్నారు. జిల్లా వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు చేపట్టిన నిరసనకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు గురుప్రసాద్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి ఓ. గంగయ్య గౌడ తదితరులు మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్‌ షఫీ, రవి కుమార్‌ నాయక్‌, ఉమాశంకర్‌, శ్రీనివాస రాజు, సతీష్‌ కుమార్‌, శివయ్య, బాలాజీ, గంగాధర్‌, ఖళీలుల్లా ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement