వాల్మీకిపురం: ఈతకు వెళ్లి గల్లంతైన వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని మూగలమర్రి పంచాయతీలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు.. మండలంలోని ఆరమడకకు చెందిన రాజారెడ్డి కుమారుడు రంజిత్ కుమార్ రెడ్డి (32) మంగళవారం మధ్యాహ్నం గ్రామస్తులతో కలిసి ఈతకు వెళ్లాడు.అతను గల్లంతు కావడంతో అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి 9గంటలైనా ఆచూకీ తెలియరాకపోవడంతో బుధవారం ఉదయం మళ్లీ గాలించారు. కొత్తపల్లిచెరువులో నుంచి రంజిత్ కుమార్ రెడ్డి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి స్థానిక ప్రభుత్వాసుపత్రి వద్దకు చేరుకొని, మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే వెంట చింతల ఆనంద రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, రెడ్డిశేఖర్ రెడ్డి, నీళ్ల భాస్కర్, కేశవ రెడ్డి, యోగేంద్ర రెడ్డి, తదితరులు ఉన్నారు.


