కడప, కర్నూలు జట్ల విజయం | - | Sakshi
Sakshi News home page

కడప, కర్నూలు జట్ల విజయం

Mar 31 2026 8:26 AM | Updated on Mar 31 2026 8:26 AM

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌–23 మెన్‌ అంతర్‌ జిల్లాల వన్డే క్రికెట్‌ మ్యాచ్‌లు కొనసాగాయి. సోమవారం వైఎస్‌ఆర్‌ఆర్‌ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన వన్డే మ్యాచ్‌లో కడప–నెల్లూరు జట్లు జట్లు తలపడ్డాయి. టాస్‌ గెలిచిన కడప జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది.. నిర్ణీత 37.2 ఓవర్లలో 239 పరుగులకు ఆలౌటైంది.జట్టులోని రణధీర్‌ రెడ్డి 51, సుదర్శన్‌ 45 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని సయ్యద్‌ షాహుల్‌ హామీద్‌ 5 వికెట్లు తీశాడు. భార్గవ్‌ మహేష్‌ 2, భార్గవ్‌ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన నెల్లూరు జట్టు 37.5 ఓవర్లల్లో 231 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులోని మన్విత్‌ కుమార్‌రెడ్డి 50, సూతేజ్‌రెడ్డి 32 పరుగులు చేశారు. కడప జట్టులోని మహ్మద్‌ ఆయూబ్‌ 5 వికెట్లు, రాజేష్‌ 2, ఆదిల్‌ హుస్సేన్‌ 2 వికెట్లు తీశారు. దీంతో కడప జట్టు 8 పరుగుల తేడాతో విజయం సాధించింది,

● కెఓఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో కర్నూలు–చిత్తూరు జట్లు తలపడ్డాయి, టాస్‌గెలిచిన కర్నూలు జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 341 పరుగులు చేసింది. జట్టు లోని నాయిముల్లా 103, సాయి సూర్య తేజరెడ్డి 134 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని సాయి చరణ్‌ 2, గౌతమ్‌ కృష్ణతేజ్‌రెడ్డి 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన చిత్తూరు జట్టు 43.2 ఓవర్లకు 265 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులోని తేజరెడ్డి 131, చరణ్‌జిత్‌ 86 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని సాబ్‌జాన్‌బాషా 5, రెహమాన్‌ 2, సాయి సూర్యతేజరెడ్డి 2, తీశారు. దీంతో 76 తేడాతో కర్నూలు జట్టు విజయం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement