బైక్‌ను ఢీకొన్న మినీ బస్సు | - | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొన్న మినీ బస్సు

Mar 30 2026 8:31 AM | Updated on Mar 30 2026 8:31 AM

చౌడేపల్లె : చౌడేపల్లె– బోయకొండ మార్గంలోని చిన్నకొండామర్రి వద్ద బైక్‌ను మినీ బస్సు ఢీకొన్న ఘటన ఆదివారం రాత్రి జరిగింది. తిరుపతి పట్టణం అవిలాలకు చెందిన నాగరాజ(45) బోయకొండ మార్గంలోని పరిసర ప్రాంతంలో పందులు మేపుతు సొంతపనిపై బైక్‌లో చౌడేపల్లెకు వచ్చాడు. మార్గమద్యలోని చిన్నకొండామర్రి వద్ద చిత్తూరుకు చెందిన ఓ మినీబస్సు ఢీకొంది. ఈ ఘటనలో నాగరాజ తలకు, కాలికి తీవ్ర గాయలయ్యాయి. అపస్మారస్థితికి చేరుకొన్నాడు. స్థానికులు 108 సహాయంతో చౌడేపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడి కుటుంభ సభ్యులు ఎవరు లేకపోవడం, గాయపడిన వ్యక్తి ఎవరని సందిగ్ధతతో సుమారు గంటన్నరసేపు క్షతగాత్రుడు కొన ఊపిరితో కొట్టిమిట్టాడుతున్న ఘటన పలువురిని కలిచివేసింది.గాయపడిన వ్యక్తి జేబులో సుమారు లక్షకుపైగా నగదు ఉండడంతోపాటు అతని సెల్‌ఫోన్‌ ద్వారా కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. ఎస్‌ఐ చిన్నరెడ్డెప్ప ఘటనా స్థలం నుంచి ఆసుపత్రికి చేరుకొని , 108 డీఎంతో ఫోన్‌లో మాట్లాడారు. 108 వాహనంలో నాగరాజను మదనపల్లె ఏరియా ఆసుపత్రికి తరలించారు. అతని జేబులో ఉన్న నగదును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. కేసు నమోదుచేసి ధర్యాప్తుచేస్తున్నట్లు ఎ్‌స్‌ఐ వివరించారు.

ఒకరికి తీవ్రగాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement