భక్తిశ్రద్ధలతో మట్టల ఆదివారం | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో మట్టల ఆదివారం

Mar 30 2026 8:30 AM | Updated on Mar 30 2026 8:30 AM

భక్తిశ్రద్ధలతో మట్టల ఆదివారం

కడప సెవెన్‌రోడ్స్‌: క్రైస్తవులు క్రిస్మస్‌ పండుగకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఈస్టర్‌ పండుగను కూడా అలాగే నిర్వహిస్తారు. ఆదివారం వైఎస్సార్‌ కడప, అన్నమయ్య జిల్లాల్లో మట్టల ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈస్టర్‌ పండుగకు వారం రోజుల ముందు పామ్‌ సండేను నిర్వహించడం పరిపాటి. కడప నగరంలో క్రైస్తవులు ఉదయాన్నే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఈత మట్టలు ధరించి ఆయా చర్చిల చుట్టూ ప్రదర్శనలు నిర్వహించారు. ఏప్రిల్‌ 3వ తేది గుడ్‌ఫ్రైడే ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరోజు ఏసుక్రీస్తు శిలువపై పలికిన ఏడు మాటలను చర్చిలలో ప్రసంగీకులు భక్తులకు వినిపిస్తారు. ఏప్రిల్‌ 4వ తేది నాటికి ఉపవాస దీక్షలు ముగుస్తాయి. మరుసటిరోజు ఆదివారం క్రీస్తు పునరుత్తానం కనుక ఈస్టర్‌ పండుగను ఘనంగా జరుపుకోనున్నారు. సీఎస్‌ఐ రాయలసీమ డయాసిస్‌ బిషప్‌ ఐజాక్‌ వరప్రసాద్‌తో పాటు విశ్వాసులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement