ప్రమాదాల నివారణపై కార్యాచరణ | - | Sakshi
Sakshi News home page

ప్రమాదాల నివారణపై కార్యాచరణ

Mar 29 2026 7:08 AM | Updated on Mar 29 2026 7:08 AM

ప్రమాదాల నివారణపై కార్యాచరణ

మదనపల్లె: ప్రమాదాల నివారణపై రూపొందించిన కార్యాచరణ పక్కాగా అమలు జరగాలని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌, ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో రహదారుల భద్రతపై కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా అధికారుల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి రహదారుల భద్రతపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ ఏడాది జరిగిన ప్రమాదాలు, హిట్‌ అండ్‌ రన్‌ కేసులు, రహదారులపై భద్రత అవగాహన కార్యక్రమాలు, ఎక్కువగా ప్రమాదాలు జరిగే బ్లాక్‌ స్పాట్లపై తీసుకున్న చర్యలను వివరించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి జాతీయరహదారిని కలిపే ప్రాంతాల్లో అధికంగా ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలిపారు. రాయచోటి, చిన్నమండెం, మదనపల్లె ప్రాంతాల్లో బైక్‌లు, కారు ప్రమాదాలు అధికంగా ఉన్నాయన్నారు. మైనర్‌ డ్రైవింగ్‌ను అరికట్టేందుకు తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడం వంటి కఠిన చర్యలు తీసుకొని అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో జాతీయ రహదారులపై 18 బ్లాక్‌ స్పాట్లను గుర్తించామని వీటి మరమ్మత్తులు జరగాల్సి ఉందని తెలిపారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జాతీయ రహదారులకు అనుసంధానమయ్యే రహదారుల వద్ద, అప్రోచ్‌ రోడ్ల వద్ద స్పీడ్‌ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్పీడ్‌ బ్రేకర్లు, బ్లాక్‌ స్పాట్స్‌ వద్ద వీధి దీపాలు, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఏప్రిల్‌ 10 లోపు చర్యలు పూర్తి చేయాలని ఆదేశించారు రాయచోటి ఆర్డీవో శ్రీనివాస్‌, డిఎంహె చ్‌ఓ లక్ష్మీనరసయ్య, ఆర్‌ అండ్‌బీ ఈఈ అరవిందాదేవి, డిస్కం ఈఈ గంగాధరం, డీఎం వెంకటరమణారెడ్డి, జిల్లా రవాణా శాఖ అధికారి, హైవే అధికారులు, పోలీస్‌ శాఖ అధికారులు, మునిసిపల్‌ కమిషనర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement