మదనపల్లెటౌన్: విలేకరి ముసుగులో అక్రమాల పేరుతో సబ్‌రిజిస్ట్రేషన్‌శాఖ రిటైర్డ్ సీనియర్ అసిస్టెంట్ కొదండరామయ్యతో కలిసి చేసిన బ్లాక్ మెయిల్ కారణంగా ఇద్దరూ జైలుపాలయ్యారు. మదనపల్లె సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అక్రమాలు జరుగుతున్నాయని వాటిని బహిహిర్గతం చేయకుండా ఉండాలంటే తాము అడిగింది ఇవ్వాలంటూ సబ్ రిజిస్ట్రార్ గురుస్వామిని డిమాండ్ చేశారు. రూ.50 లక్షల డబ్బు ఇవ్వాలని, లేకపోతే ఇంటిస్థలం ఇవ్వాలని బెదిరించి కేసులో ఇరుక్కున్నారు. దీనికి సంబంధించి శుక్రవారం మదనపల్లె వన్ టౌన్ సీఐ రాజారెడ్డి మీడియాకు వెల్లడించిన వివరాలు..చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నేల్లపల్లి గ్రామానికి చెందిన బూరగన్ దొరస్వామి(45), చిత్తూరులో విలేకరిగా చెలామణి అవుతున్నాడు. ఈ క్రమంలో మదనపల్లె సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసి రిటైర్డ్ అయి సొసైటీ కాలనీలో నివాసం ఉంటున్న కోదండ రామయ్యతో కలిసి గత కొంతకాలంగా ప్రస్తుత మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ గురుస్వామిని భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి లొసుగులు తమవద్ద ఉన్నాయంటూ బెదిరింపులకు పాల్బడ్డారు. వాటి ఆధారంగా రూ.50 లక్షలు డబ్బు డిమాండ్ చేస్తూ వచ్చారు. అంతటితో ఆగకుండా గురుస్వామి వ్యక్తిగత, కుటుంబానికి సంబంధించిన ఆస్తుల వివరాలు సేకరించి ఫోన్ చేస్తూ, వాట్సప్ మేసేజ్‌ల ద్వారా నిత్యం బెదిరింపులకు పాల్పడుతూ బ్లాక్‌మెయిల్ చేశారు. బంధువులకు చెందిన ఇళ్లవద్దకువెళ్లి ఫొటోలు తీయడం, వాటిని వాట్సాప్‌లో పంపిస్తూ ఒత్తిడి చేసేవారు. దీంతో గురుస్వామి పోలీసులను ఆశ్రయించి బుధవారం ఇద్దరిపై ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్‌ఐ రహీముల్లా దొరస్వామి, కోదండ రామయ్యలపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రూ.50 లక్షల నగదు లేదా ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్
రిటైర్డ్ సీనియర్ అసిస్టెంట్ సహా ఇద్దరు అరెస్ట్


