రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

Mar 28 2026 7:35 AM | Updated on Mar 28 2026 7:35 AM

మదనపల్లె టౌన్‌ : కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మదనపల్లె యువకుడు దుర్మరణం చెందాడు. కర్ణాటక పోలీసులు మదనపల్లె తాలూకా పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు సీఐ కళావెంకటరమణ తెలిపిన వివరాలు.. పట్టణంలోని ఎగువ కురవంకకు చెందిన సమీర్‌బాషా(38) కర్ణాటక రాష్ట్రం చింతామణికి సొంత పని మీద ద్విచక్ర వాహనంలో వెళ్లాడు. పని ముగించుకుని శుక్రవారం తెల్లవారుజామున మదనపల్లెకి తిరిగి వస్తుండగా, మార్గంమధ్యలోని కర్ణాటక రాష్ట్రం రాయల్పాడు మండలం తూపల్లి క్రాస్‌ వద్ద రోడ్డుపై నిలిపి ఉన్న లారీని సమీర్‌ బాషా ప్రయాణిస్తున్న బైక్‌ ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో అక్కడికక్కడే సమీర్‌ బాషా మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో రాయల్పాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, విచారణ అనంతరం కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని శ్రీనివాసపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు మృతదేహాని అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement