మదనపల్లె సిటీ: సమాజ సేవే పరమార్థంగా.. ఉన్నత అవకాశాలే లక్ష్యంగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో భాగస్వాములవుతున్నారు. కేవలం చదువులకే పరిమి తం కాకుండా తమ సత్తా ఏమిటో నేటి ప్రపంచానికి చాటి చెబుతామని అంటున్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ లో చేరి నిర్దేశించుకున్న లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నారు. మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ వి ద్యార్థినులు. కళాశాలకు చెందిన పద్మప్రియ, పవిత్ర, చైతన్య, కె.అఖిల ఈనెల 9వత తేదీ నుంచి 13వతేదీ వరకు డార్జిలింగ్‌లో జరిగిన జాతీయ శిబిరానికి హాజరయ్యారు. వీరికి గైడ్‌గా అధ్యాపకురాలు మోహన్‌వల్లి వ్యహరించారు. డార్జిలింగ్‌లో జరిగిన వివిధ సాహస కృత్యాలు చేసి పతకాలు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు.
పలు అంశాలపై అవగాహన
విద్యార్థులకు సామాజిక సేవ, దేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానంపై అవగాహన కల్పించారు. శిబిరంలో పలు రారష్ట్‌రాలకు చెందిన వారు ఉంటడటంతో అందరితో స్నేహపూర్వక భావనతో మెలిగారు .ఎల్తైన గుట్టలు, అటవీ ప్రాంతాల్లో జీవిస్తున్న వారి స్థితిగతులను తెలుసుకున్నారు. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వారి బాష, పరిజ్ఞానం ఆధారంగా బృందాలుగా విభజించి వివిధ రకాల పోటీల్లో పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సాహస కృత్యాలు
విద్యార్థినులు ఐదురోజుల పాటు డార్డిలింగ్‌లో స్కై, స్లైకింగ్, ట్రెక్కింగ్, షూటింగ్, హైకింగ్, అర్చరీ వంటి కృత్యాల్లో పాల్గొన్నారు. విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం, థైర్యం, నాయకత్వ లక్షణాలు పెంపొందించాయి.


