గడ్డి మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

గడ్డి మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Mar 27 2026 8:48 AM | Updated on Mar 27 2026 8:48 AM

మదనపల్లెటౌన్‌: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ములకలచెరువు పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని, మద్దినాయునిపల్లె గ్రామం, బూడిదగడ్డలో కాపురం ఉంటున్న సురేంద్ర(45) కూలి పనులతో భార్య పిల్లలను పోషించు కుంటున్నాడు. గత కొంత కాలంగా కూలి పనులకు వెళ్లి వచ్చే సంపాదనను సురేంద్ర తాగుడుకు ఖర్చు చేస్తుండడంతో ఇంట్లో మందలించారు. దీంతో అతను వారితో గొడవపడి మనస్థాపం చెందాడు. జీవితంపై విరక్తి చెంది టమాటా తోటలో గడ్డి మొలవ కుండా కొట్టడానికి తెచ్చి ఇంట్లో ఉంచిన గడ్డి నివారణ మందు తాగాడు. కుటుంబీకులు అతన్ని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి రెఫర్‌ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రతాప్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement