లక్ష్మీసుకన్య ఆరోపణలు అవాస్తవం | - | Sakshi
Sakshi News home page

లక్ష్మీసుకన్య ఆరోపణలు అవాస్తవం

Mar 25 2026 7:12 AM | Updated on Mar 25 2026 7:12 AM

మదనపల్లె అర్బన్‌ : చీటీ డబ్బుల విషయంలో లక్ష్మీసుకన్య తనపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమంటూ నక్కలదిన్నెకు చెందిన అంగన్‌వాడీ టీచర్‌ రాజేశ్వరీ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మదనపల్లె మండలం చిప్పిలికి చెందిన లక్ష్మీసుకన్య చీటీ డబ్బుల విషయంలో తనపై లేనిపోని అభాండాలు వేస్తోందన్నారు. తన వద్ద చీటీలు వేసిందని, దాంతో తానే ఆమెకు రూ.80 లక్షలు చెల్లించాలంటూ ఆరోపణలు చేస్తోందన్నారు. అయితే చీటీలకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తన భర్త కృష్ణారెడ్డి రాజ్‌భవన్‌ రాజా వద్ద పూచీపడి ఆమెకు రూ.40 లక్షలు చీటీ డబ్బులు తీసిచ్చాడన్నారు. అదే విధంగా తన కుమారుడి పెళి్‌ల్‌ సమయంలో జీఎస్టీ లేకుండా తక్కువ ధరకు బంగారు కొనిస్తానని ఆశ చూపి తన నుంచి రూ.30 లక్షలు తీసుకుందన్నారు. బంగారు కొనివ్వకపోగా, రూ.40 లక్షలు చీటీ డబ్బులు కూడా చెల్లించలేదన్నారు. మొత్తం రూ.70 లక్షలు బాకీ ఉందన్నారు. ఈ డబ్బులు అడిగినందుకు తనపై అభాండాలు వేసిందన్నారు. తానే రూ.80 లక్షలు చెల్లించాలంటూ ఆరోపణలు చేస్తూ.. కలెక్టర్‌కు, తాలూకా పోలీసులకు ిఫిర్యాదు చేసిందన్నారు. అధికారులు క్షేత్రస్థాయి విచారణ చేసి తనకు రావాల్సిన నగదు రికవరీ చేసి న్యాయం చేయాలంటూ బాధితురాలు విన్నవించింది. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు హరిశర్మ, శ్రీనివాసులు, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు విజయ, గౌరీ, భాగ్యమ్మ, ప్రభావతి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement