పేద కుటుంబానికి పెద్ద కష్టం | - | Sakshi
Sakshi News home page

పేద కుటుంబానికి పెద్ద కష్టం

Mar 21 2026 5:08 AM | Updated on Mar 21 2026 5:08 AM

పేద కుటుంబానికి పెద్ద కష్టం యువకుడి ఆత్మహత్య

తంబళ్లపల్లె : ఓ నిరుపేద కుటుంబానికి పెద్దకష్టం వచ్చింది. చేతిలో చిల్వి గవ్వ లేకపోవడంతో వైద్యం కోసం ఆదుకోవాలని వేడుకుంటోంది. తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లె పంచాయతీ నల్లతిమ్మిరెడ్డిగారిపల్లెకు చెందిన అమరనాథరెడ్డిది మధ్య తరగతి కుటుంబం. ఆయనకు భార్య పద్మావతి, కొడుకు (6) ఉన్నారు. బెంగళూరులో ఉంటూ ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పది రోజుల క్రితం తీవ్ర అనారోగ్యం చేయడంతో కుటుంబ సభ్యులు బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు కాలేయంతోపాటు రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయని నిర్ధారించారు. దీంతో డయాలసిస్‌ చేస్తున్నారు. వైద్య సహాయం కోసం దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని అమరనాథరెడ్డి భార్య పద్మావతి వేడుకుంటోంది. స్టేట్‌బ్యాంకు అకౌంట్‌ నంబర్‌ 33169323221 (ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ –ఎస్‌బీఐఎన్‌ 0016498)కు 7337040084 ఫోన్‌ నంబర్‌ను సంప్రందించాలని కోరింది.

ఇంటర్‌ మూల్యాంకనం వాయిదా

రాయచోటి : ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షా పత్రాల మూల్యాంకనాన్ని ఈ నెల 22వ తేదీకి మార్చినట్లు జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ అధికారి రవి తెలిపారు. సాధారణంగా ఈ నెల 21 నుంచి మూల్యాంకనం ప్రారంభం కావాల్సి ఉంది. 21వ తేదీన రంజాన్‌ పండుగ సందర్భంగా ఇంటర్మీడియట్‌ బోర్డు ఆదేశాల మేరకు 22వ తేదీ (ఆదివారం)కి వాయిదా వేసినట్లు శుక్రవారం డీఐఈఓ ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌, ఎకనామిక్స్‌, హిస్టరీ ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షా పత్రాల మూల్యాంకనం జరగాల్సిన విషయం అధ్యాపకులకు తెలిసిందే. వాయిదా విషయాన్ని జిల్లాలోని సంబంధిత ప్రిన్సిపాల్‌లు, అధ్యాపకులు గమనించి 22వ తేదీ మూల్యాంకానికి రావాలని తెలిపారు.

ఎముకల డాక్టర్లను

సరెండర్‌ చేయండి: ఎమ్మెల్యే

మదనపల్లెటౌన్‌ : మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి రోడ్డు ప్రమాదాల్లో కాళ్లు, చేతులు విరిగి ప్రాణాపాయస్థితిలో వచ్చే వారికి ఒక్క పీఓపీ కట్టు కూడా కట్టని ఆ ఇద్దరి ఎముకల డాక్టర్లను సరెండర్‌ చేయాలని ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా ఆదేశించారు. శుక్రవారం జిల్లా ఆస్పత్రిని ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎముకల డాక్టర్‌లు భరద్వాజ్‌, అర్చనలు విధులు సక్రమంగా చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయని, సూపరింటెండెంట్‌ వెంటనే స్పందించి భరద్వాజ్‌ను సరెండర్‌ చేసుకోవాలని ఆదేశించారు. ప్యాకెట్‌లో పైసా లేని పేదోళ్లు జిల్లా ఆస్పత్రిని నమ్ముకుని వస్తే ఇక్కడ ఇద్దరు ఎముకల డాక్టర్లు ఉండి కూడా కట్టుకూడా కట్టరంటే చాలా దారుణం అన్నారు. మనకు పని చేసే దాక్టర్లు కావాలే గానే పని చేయని డాక్టర్లు అవసరం లేదని వెంటనే భరద్వాజ్‌ను సరెండర్‌ చేయాలని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే ఆస్పత్రిలో మందుల కొరత లేకుండా చూసుకునే బాధ్యత ఫార్మసీలపై ఉందన్నారు. అత్యవసరం అయితే హెచ్‌డీఎస్‌ నిధులు వెచ్చించి మందులు కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట డాక్టర్‌ రాధిక, హెడ్‌ నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు.

మైదుకూరు : ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మైదుకూరులో జరిగింది. శుక్రవారం పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్న తుపాకుల శివశంకర్‌ (36) అనే యువకుడు గ్యాస్‌ స్టౌవ్‌లను రిపేరు చేస్తూ జీవనం సాగించేవాడు. ప్రొద్దుటూరుకు చెందిన అనిత అనే యువతితో వివాహం కాగా ఇద్దరు మగ పిల్లలు, ఇద్దరు ఆడ పిల్లలు సంతానం ఉన్నారు. తల్లిదండ్రుల నుంచి వేరుపడిన శివశంకర్‌ చెడు వ్యసనాలకు బానిసై ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించలేక ఇబ్బందులు పడేవాడు. గురువారం రాత్రి భార్య, పిల్లలు అదే కాలనీలో తన ఇంటి సమీపంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లడంతో శివశంకర్‌ ఇంటిలో ఉరి వేసుకున్నాడు.

ఇంటి యజమానికి

దెబ్బతిన్న కాలేయం, కిడ్నీలు

ఆదుకోవాలని వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement