ఘనంగా ఉట్ల తిరునాల | - | Sakshi
Sakshi News home page

ఘనంగా ఉట్ల తిరునాల

Mar 21 2026 5:08 AM | Updated on Mar 21 2026 5:08 AM

ఉట్ల మాను ఎక్కేందుకు సిద్ధంగా ఉన్న యువకులు

ఉట్ల మాను ఎక్కుతున్న యువకులు

మదనపల్లె సిటీ : స్థానిక నీరుగట్టువారిపల్లెలోని శ్రీ చౌడేశ్వరి ఆలయంలో జ్యోతి ఉత్సవాలు పురస్కరించుకుని శుక్రవారం ఉట్ల తిరునాల ఘనంగా నిర్వహించారు. ఆలయం ఎదుట ప్రాంగణంలో ఉట్ల మాను ఏర్పాటు చేశారు. యువకులు ఎంతో ఉత్సాహంగా ఉట్ల మాను ఎక్కేందుకు ముందుకు వచ్చారు. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఉట్లమాను కొందరు యువకులు ఎక్కి తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ఉదయం ఆలయంలో చౌడేశ్వరి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో చౌడేశ్వరిదేవి దేవస్థానం అధ్యక్షులు పురాణం చంద్రశేఖర్‌, కార్యదర్శి పవన్‌కుమార్‌, కోశాధికారి రత్నమయ్య, శ్రీరాంచినబాబు, ఉప్పు రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement