మదనపల్లెలో ఎస్పీ కార్యాలయం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

మదనపల్లెలో ఎస్పీ కార్యాలయం ప్రారంభం

Mar 16 2026 7:34 AM | Updated on Mar 16 2026 7:34 AM

మదనపల్లెలో ఎస్పీ కార్యాలయం ప్రారంభం నేడు డయల్‌ యువర్‌ సీఎండీ తాళ్లపాకను సందర్శించిన తెలంగాణా పోలీస్‌ అధికారి పబ్లిక్‌ పరీక్షలకు ప్రైవేటు టీచర్లు!

మదనపల్లెటౌన్‌:మదనపల్లెలో స్థానిక బెంగుళూరు రోడ్డులో అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించారు. ఉద యం వేద పండితులతో కలసి ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి, అడిషనల్‌ ఎస్పీ వెంకటాద్రి ప్రత్యే పూజలు నిర్వహించారు. అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడా రు. మదనపల్లె కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రారంభించి, ప్రజలకు అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. ఇక నుంచి ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా ఎస్పీ కార్యా లయం నుంచి ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణంలోని సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

రాయచోటి జగదాంబసెంటర్‌: విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 16న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ‘డయల్‌ యువర్‌ సీఎండీ’కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్‌ నిర్వహించనుంది. ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ సీఎండీ కార్యక్రమం ద్వారా వినియోగదారులు మొబైల్‌ నంబర్‌ 89777 16661కు కాల్‌ చేసి తమ విద్యుత్‌ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చు.

సర్కిల్‌ స్థాయిలోనూ

డయల్‌ యువర్‌ ఎస్‌ఈ

డయల్‌ యువర్‌ ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ కార్యక్రమంతో పాటు సర్కిల్‌ స్థాయిలో కూడా ప్రతి సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ‘డయల్‌ యువర్‌ ఎస్‌ఈ’కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లా స్థాయిలో తమ విద్యుత్‌ సమస్యలను సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ దృష్టిని తీసుకువచ్చేందుకు వీలుగా వినియోగదారులు 9440817449 నంబర్‌కు కాల్‌ చేయవచ్చు. ఈ అవకాశాన్ని విద్యుత్‌ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎస్పీడీసీఎల్‌ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో వివరించారు.

రాజంపేట: పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్ధలిలోని సిద్దేశ్వరస్వామి ఆలయాన్ని తెలంగాణా పోలీస్‌ అధికారి డా.తరుణ్‌జోషి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయంలో ఏకాతాతయ్యను దర్శించుకున్నారు. అన్నమాచార్యులు ఆరాధించి, పూజించిన శ్రీ చెన్నకేశవస్వామిని కూడా దర్శించుకున్నారు.

కడప ఎడ్యుకేషన్‌: విద్యాశాఖ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది పదవ తర గతి పబ్లిక్‌ పరీక్షల తంతు సాగుతోంది. ఇన్విజిలేటర్లు మొదలుకుని చీఫ్‌లు, డీఓలను జిల్లా పరిధిలో డీఈఓ కాకుండా రాష్ట్ర కమిషనర్‌ కార్యాలయం నుంచి నేరుగా విధులను కేటా యించడం గందరగోళానికి గురి చేస్తోంది. పైగా ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా ప్రైవేటు స్కూల్‌ టీచర్లను నియ మించారు. గతంలో పరీక్షల నిర్వహణకు అనుభవం ఉన్న టీచర్లను సూపరింటెండెంట్లుగా, డిపార్టుమెంట్‌ల్‌ ఆఫీసర్లుగా నియమిస్తూ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న వారికి మినహాయింపు ఇచ్చే వారు. ప్రస్తుతం సీనియర్‌ ఉపాధ్యాయుల సమస్యలను పరిగణనలోకి తీసుకోకుండా విధులను కేటాయించడం గమనార్హం. అదే విధంగా ఇన్విజిలేటర్లగా గతంలో ఎప్పు డూ లేని విధంగా 25 శాతం మంది ప్రైవేటు స్కూల్‌ టీచర్లకు పరీక్షల డ్యూటీలు నియమించడంపై సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఇన్విజిలేషన్‌ డ్యూటీ ఎంతో బాధ్యతాయుమైనది. కేంద్రాల్లో ఏదైనా తప్పు జరిగితే ప్రభుత్వ స్కూల్‌ టీచర్లపై కఠిన చర్యలు తీసుకుంటారనే భయంతోనైనా టీచర్లు అక్రమాలకు ఆస్కారం లేకుండా విధులు నిర్వహిస్తారు. కానీ ప్రైవేటు స్కూల్‌ టీచర్లు తప్పులు చేసినా వారిపై విద్యా శాఖ ఎలాంటి చర్యలు తీసుకోదని అలాంటి సమయంలో సీఎస్‌, డీఓలను బాధ్యులను చేసే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement