శుభాల రేయి షబ్‌–ఏ–ఖదర్‌ | - | Sakshi
Sakshi News home page

శుభాల రేయి షబ్‌–ఏ–ఖదర్‌

Mar 16 2026 7:34 AM | Updated on Mar 16 2026 7:34 AM

మదనపల్లె సిటీ: ముస్లింలకు శుభప్రదమైన, పుణ్యప్రదమైన రాత్రి షబేఖదర్‌ రానే వచ్చింది. దీనిని లైలతుల్‌ఖదర్‌ అని కూడా పిలుస్తారు. షబ్‌ అంటే రాత్రి, ఖద్ర్‌ అంటే ఉన్నతమైన అని అర్థం. రంజాన్‌ మాసంలో 27వ రాత్రి వచ్చే షబ్‌ ఏ ఖద్ర్‌ రోజునే పవిత్ర దివ్యఖురాన్‌ అవతరించిందని ముస్లింల నమ్మకం. సోమవారం ముస్లింలు లైలతుల్‌–ఖదర్‌ పర్వదినాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. ఈ పవిత్ర రేయంతా ఇషా నమాజ్‌ నుంచి తెల్లవారుజామున సెహరి వేళ వరకు ముస్లింలు అధ్యాత్మికంగా గడుపుతారు. పగలంతా రోజా ఉంటారు. రాత్రంతా ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. తరావీహ్‌ నమాజ్‌, బయాన్‌, హదీస్‌, ఖురాన్‌ తిలావత్‌, సలాతుజ్‌, తజ్బీ, తహజ్జుద్‌ నమాజ్‌, దువా ఇలా రేయంతా అల్లాహ్‌ ఆరాధనలో గడుపుతారు. తోబా, అస్తగ్‌ఫిరుల్లా చదివి తప్పుల నుంచి క్షమా పణ కోరి, నరకం, నరకాగ్ని నుంచి ముక్తి కోరుతారు. ఈ లైలతుల్‌ ఖద్ర్‌ రాత్రంతా జాగరణ చేసి, అధ్యాత్మికంగా గడిపిన వ్యక్తికి వెయ్యి నెలలకుపైగా ప్రార్థనలు చేసిన పుణ్యం లభిస్తుందని ముస్లింల విశ్వాసం.

విద్యుద్దీపాల వెలుగుల్లో మదనపల్లెలోని

జామియా మసీదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement