కలకడ : పాడిపశువులకు, లేగదూడలకు ఖనిజ, లవణాలు కలిగిన మిశ్రమ మేతను సమపాళ్లలో అందించాలని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి గుణశాఖర్ పిళ్లై అన్నారు. గురువారం మండలంలోని ఎర్రకోటపల్లె పంచాయతీ గువ్వలవాండ్లపల్లెలో జిల్లా పశుసంవర్ధకశాఖ, ఆంధ్రప్రదేశ్ పశుగనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లేగదూడల ప్రదర్శనను పరిశీలించారు. జిల్లా లో అనేకమంది రైతులు పాడిపరిశ్రమపై ఆధారపడ్డారని, నేటికి స్వచ్ఛమైన ఆవుపాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని గుర్తు చేశారు. పచ్చిగడ్డి మేతకు అన్ని దాణాలు తక్కువే అని గుర్తు చేశారు. లేగదూడలకు ఆవుపాలు వదలాలని సూచించారు. లేగదేడలకు యాజమాన్యపద్ధతిలో ఖనిజ, లవణాల మిశ్రమం అందించాలని అన్నారు. లేగదూడల పెంపకంపై శ్రద్ధ చూపిన రైతులు కె.వెంకట్రమణరెడ్డి,కె.చిన్నబాబు, సుధాకర్‌రెడ్డిలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు.కార్యక్రమంలో రాయచోటి డివిజన్ ఉపసంచాలకులు డాక్టర్ కృష్ణయ్య, పశువైద్యాధికారులు డాక్టర్ తేజకళ్యాణ్, డాక్టర్ పూర్ణిమ, రైతులు పాల్గొన్నారు.


