రామాపురం : భార్యను వేధించిన కేసులో భర్తకు ఏడాది జైలు, రూ.1000 జరిమానా విధిస్తూ లక్కిరెడ్డిపల్లె జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి సీహెచ్ భరత్‌కమల్ తీర్పు చెప్పారు. వివరాలు..వీరబల్లి మండలం వంగిమళ్ల గ్రామానికి చెందిన పెద్దివీటి దర్బారుబాబుకు రామపురం మండలం చిట్లూరుకు చెందిన రాజేశ్వరికి 12 ఏళ్ల క్రితం వివాహమైంది.వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. దర్బార్‌బాబు ఇటీవల మద్యానికి బానిసయ్యాడు.తరచూ భార్యతో గొడవపడేవాడు. కొట్టటం, హింసించడం చేసేవాడు. దీంతో రాజేశ్వరి 2021లో పుట్టింటికి వచ్చింది.అదే ఏడాది అక్టోబర్ 4న పోలీసు స్టేషన్‌లో భర్త వేధింపులపై ఫిర్యాదు చేసింది. ఈమేరకు పోలీసులు విచారణ చేపట్టారు. నేరం రుజువు కావడంతో ఏడాదిపాటు జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.


