మదనపల్లె: ఎయిడ్స్, హెచ్‌ఐవీ రహిత జిల్లాగా చేసేందుకు దానికి సంబంధించిన కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి లక్ష్మినరసయ్య కోరారు. మంగళవారం ఆయన ఆధ్వర్యంలో మదనపల్లెలోని ఏపీసిసి–కమ్యూనిటీ అడ్వైజరీ బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్‌ఐవీ పూర్తిస్థాయిలో అరికట్టేందుకు సంబంధిత శాఖలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలన్నారు. క్లస్టర్ ప్రోగ్రాం అధికారి భాస్కర్ మాట్లాడుతూ ఎయిడ్స్ నివారణ కార్యక్రమాలను గ్రామస్థాయికి తీసుకెళ్లాలని, కమ్యూనిటీ భాగ స్వామ్యాన్ని పెంచాలన్నారు. అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాధిక మాట్లాడారు. ఈ సమావేశంలో డెమో ఆఫీసర్ దేవసిరోమణి, డిఏపిసియు సిలార్ సాబ్ పాల్గొన్నారు.
హెచ్‌ఐవీ నివారణకు
సమన్వయంతో పనిచేయాలి
మదనపల్లెటౌన్: హెచ్‌ఐవీ నివారణకు అందరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా డీఎంహెచ్‌ఓ డాక్టర్ లక్ష్మీనరసయ్య అన్నారు. మదనపల్లె డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో మంగళవారం జిల్లాలోని ఏఆర్‌టీ, ఐసీటీసీ, ఎస్టీఐ, ఎన్జీవోల ప్రతినిధులతో జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా పరిధిలోని అన్ని శాఖలు కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. హెచ్‌ఐవీపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. అదనపు జిల్లా ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎల్ రాధిక, సీపీఎం డేవిడ్ భాస్కర్ ,జిల్లా సూపర్ వైజర్ ప్రసాద్, ఆనంద్ పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ లక్ష్మినరసయ్య


