పక్కాగా ఉపాధి హామీ పనులు | - | Sakshi
Sakshi News home page

పక్కాగా ఉపాధి హామీ పనులు

Mar 11 2026 7:44 AM | Updated on Mar 11 2026 7:44 AM

పక్కాగా ఉపాధి హామీ పనులు

మదనపల్లె: ఏప్రిల్‌ ఒకటి నుంచి అమలులోకి రానున్న వీబీ జీ రాం జీ పథకం పక్కాగా అమలవుతుందని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ వెంకటరత్నం అన్నారు. మంగళవారం జిల్లాలోని ఏపీవోలు, సాంకేతిక అధికారులకు పథకం అమలుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త పథకం గురించి శిక్షణ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులతో ఈ పథకం అమలవుతుందన్నారు. ఉపాధి పనులకు వచ్చే కూలీలకు కచ్చితంగా ఐరిస్‌ ద్వారానే హాజరుంటుందని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి ఏపీవోల వరకు పథకం అమలుపై అవగాహన పెంచుకొని పనిచేయాలన్నారు.

ఉపాధి పనుల పరిశీలన

వాల్మీకిపురం: వికసిత్‌ భారత్‌ జి రాం జి పథకం కింద 125 రోజులు ఉపాధి పనులు కల్పించనున్నట్లు డ్వామా పీడీ తెలిపారు. మంగళవారం చింతలవారిపల్లి, విఠలంలో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. అనంతరం ఉపాధి హామీ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement