● పీజీఆర్‌ఎస్‌ సమస్యలను పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

● పీజీఆర్‌ఎస్‌ సమస్యలను పరిష్కరించాలి

Mar 10 2026 7:29 AM | Updated on Mar 10 2026 7:29 AM

● పీజీఆర్‌ఎస్‌ సమస్యలను పరిష్కరించాలి

– కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌

మదనపల్లెఅర్బన్‌: పీజీఆర్‌ఎస్‌ సమస్యల సత్వర పరిష్కారానికి ఆయాశాఖల అధికారులు చొరవ చూపాల ని కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలన్నారు. ఆయాశాఖల పరిధిలో ఆడిట్‌ నిర్వహించాలన్నారు. అర్జీదారులతో నేరుగా మాట్లాడి పెండింగ్‌ ఆడిట్‌ను పూర్తి చే యాలని ఆదేశించారు. ఇందులోభాగంగా ప్రజల నుంచి 306 అర్జీలను స్వీకరించినట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్‌రావు, సబ్‌కలెక్టర్‌ చల్లా కళ్యాణి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement