మదనపల్లెలోని చీకిలగుట్టకు చెందిన ఓ దంపతులు దారుణంగా మోసగించారు. కొన్నిరోజుల కిందట నమ్మించి రూ.2.47 కోట్లు నగదు, 600 గ్రాముల బంగారు తీసుకున్నారు. మా పేరిట కళాశాల నిర్మాణం, భూములు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయిస్తామని మాయమాటలతో నమ్మించి నగదు, బంగారుతీసుకుని మోసగించారు. వీరి మోసంపై పలుమార్లు పోలీస్, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పైగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు న్యాయం జరగలేదు. ఎనిమిది నెలలుగా పోరాటం చేస్తున్నా న్యాయం జరక్కపోవడంతో పెట్రోల్ బాటిల్‌తో కలెక్టరేట్‌కు వచ్చాను. నాకు న్యాయం జరిగేలా చూడాలి. – స్వాతి, హిజ్రా


