పుంగనూరు: శ్రీసుగుటూరు గంగమ్మజాతరకు వచ్చే వేలాది మంది భక్తులతో పోలీసులు మర్యాదగా మాట్లాడాలని, అమర్యాదగా, దురుసుగా ప్రవర్తించరాదని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం రాత్రి గంగజాతర ఏర్పాట్లపై పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అత్యంత చరిత్రాత్మకంగా జరిగే జాతరకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టామన్నారు. అవసరమైతే ప్రజలు 112కు కాల్ చేయాలని సూచించారు. ఎలాంటి వదంతులను నమ్మవద్దన్నారు. జాతర సందర్భంగా పట్ణణంలో సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టామన్నారు. సమావేశంలో ఏఎస్పీ వెంకటాద్రి, డీఎస్పీ కృష్ణమోహన్, సీఐ సుబ్బరాయుడు, ఎస్‌ఐ అన్సర్‌బాషా పాల్గొన్నారు.
బాధితులకు భరోసా ఇవ్వండి
మదనపల్లెటౌన్ : జిల్లా ప్రజల సమస్యలు పరిష్కరించి వారికి భరోసా ఇవ్వాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అధికారులను ఆదేశించారు. మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. అడిషనల్ ఎస్పీ వెంకటాద్రితో కలసి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి 51 అర్జీలను స్వీకరించారు. బాధితుల నుంచి సమస్యలు శ్రద్దగా విన్న ఎస్పీ వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత సీఐ, ఎస్‌ఐ లకు ఎస్పీ సూచించారు.
మోసం చేసిన కూతురిపై ఎస్పీకి ఫిర్యాదు
మదనపల్లెటౌన్ : కూతురు మోసం చేసిందని వృద్ధ దంపతులు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లికి పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఆ వివరాలు మదనపల్లె పట్టణం, నర్శింగ్ హోం వీధిలో నివాసం ఉంటున్న షేక్ ఖాసీం సాబ్, షహనాజ్‌ల ఇంటిని తన కూతురు షేక్. రఫియా ఇటీవల మోసం చేసి రాయించుకుందని బాధితులు తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీకి కూతురు చేసిన మోసాన్ని వివరించారు. ఊత కర్ర లేనిదే నడవ లేని తమను ఇళ్లు విడచి వెళ్లిపొమ్మని కూతురు బాధిస్తున్నట్లు తెలిపారు. విచారించి తమకు న్యాయం చేసి ఆదుకోవాలని కోరారు.
జిల్లా ఎస్పీ ధీరజ్‌కునుబిల్లి


