వృద్ధుడి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

వృద్ధుడి అదృశ్యం

Mar 8 2026 7:42 AM | Updated on Mar 8 2026 7:42 AM

గాయపడిన యువకుడి మృతి

పెద్దమండ్యం : వృద్ధుడు అదృశ్యమైనట్లు అతని కుటుంబ సభ్యులు శనివారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలలోకి వెళితే... మండలంలోని కోటకాడపల్లె పంచాయతీ తాటిమాకులపల్లెకు చెందిన నిమ్మనపల్లె క్రిష్ణారెడ్డి రైతు. ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు చికిత్సలు చేయించారు. మతిస్థితిమితం కాస్త తగ్గడంతో ఇంటి వద్దనే ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం పల్లె నుంచి కలిచెర్ల బస్టాండుకు వచ్చి బస్సు ఎక్కి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తిరిగి ఇంటికి రాలేదు. బంధువులు, స్నేహితులను అడిగినా ఆచూకీ తెలియక పోవడంతో ఎక్కడికి వెళ్లారనేది తెలియరాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. వృద్ధుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రావణి తెలిపారు. వృద్ధుడి ఆచూకీ తెలిసిన వారు సెల్‌ నంబర్‌: 9440900718కు తెలియజేయాలని ఎస్‌ఐ కోరారు.

బంతగుట్ట అడవికి నిప్పు

బి.కొత్తకోట : మండలంలోని హార్సిలీహిల్స్‌ సెక్షన్‌ పరిధిలోని బంతగుట్ట అడవి తగలబడుతోంది. శనివారం సాయంత్రం అడవికి నిప్పు పెట్టడంతో బంతగుట్ట, దాని చుట్టూ ఉన్న అడవి దహించిపోతోంది. ఈ అటవీ ప్రాంతం మొత్తం హార్సిలీకొండకు సమీపంలో ఉంటుంది. దీనికి నిప్పు పెట్టడంతో మంటలు ఎగిసిపడటంతోపాటు దట్టమైన పొగ కమ్మేస్తోంది. పామూరువారిపల్లె, కుమ్మరపల్లె, ఉలవల వారిపల్లె, మొగసాలమర్రి, పెమ్మన్నగారిపల్లె, ఎర్రగుంట్ల మాలపల్లెలను దట్టమైన పొగ కమ్మేయడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు. ఈ మంటలు వ్యాపిస్తూ పోతున్నాయి. ఈ అటవీ ప్రాంతంలో వన్యప్రాణులు సంచరిస్తున్నాయి. హార్సిలీకొండ అడవి సమీపంలోనే ఈ కాలుతున్న ప్రాంతం ఉంది. ఈ మంటలను అదుపు చేయడానికి కూడా వీలైనంత వేగంగా విస్తరిస్తున్నాయి.

టమాటాల లారీ బోల్తా

లింగాల : లింగాల మండలం వెలిదండ్ల గ్రామ సమీపంలోని కొండమోటు క్రాస్‌ వద్ద టమోటాల లోడ్‌తో వెళుతున్న లారీ బోల్తా పడింది. వివరాలలోకి వెళితే.. పార్నపల్లికి చెందిన పండు టమోటాల మండి వద్ద లోడ్‌ చేసుకుని వెళుతున్న లారీ శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో అదుపుతప్పి బోల్తా పడింది. సుమారు 20 టన్నులతో వెళ్తున్న లారీ బోల్తాపడడంతో సుమారు నాలుగు లక్షల దాకా నష్టం వాటిల్లిందని టమోటాల మండి వ్యాపారి పండు తెలిపారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు.

అట్లూరు : మండల పరిధిలోని కడప–బద్వేలు ప్రధాన రహదారిపై అయ్యప్పస్వామి ఆలయ సమీపాన రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడు మాడపూరు వెంకటరమణ మృతి చెందినట్లు అతని బంధువులు శనివారం తెలిపారు. ఈ నెల 4న వరికుంట ఎస్సీ కాలనీకి చెందిన మాడపూరు వెంకటరమణ ద్విచక్రవాహనంపై సొంత పనులపై వెళ్లి తిరిగి రాత్రి ఇంటికి వెళుతుండగా అట్లూరు మండలం చౌటపల్లె గ్రామానికి చెందిన భాస్కర్‌ ఆచారి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకటరమణ తీవ్రంగా గాయపడ్డాడు. 108 వాహనంలో అతన్ని కడప రిమ్స్‌కు తరలించగా మెరుగైన వైద్యం కోసం రాయవేలూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు మృతుని బంధువులు తెలిపారు.

రాజంపేట వైద్యుల

నైపుణ్యం భేష్‌

కడప సెవెన్‌రోడ్స్‌ : హై రిస్క్‌ గర్భిణి కేసును సాహసోపేతంగా, విజయవంతంగా నిర్వహించి ఆమె ప్రాణాల్ని కాపాడిన రాజంపేట ఏరియా ఆసుపత్రి వైద్యుల బృందాన్ని సెకండరీ హెల్త్‌ డైరెక్టర్‌ ఎం.వి.చక్రధర్‌ బాబు ప్రశంసించారు. హైరిస్క్‌ ఆపలేషన్‌ వార్తను తెలుసుకున్న వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ సూచన మేరకు డాక్టర్లకు చక్రధర్‌బాబు ప్రశంసిస్తూ శనివారం లేఖ రాశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పివియన్‌ రాజు, గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ సిహెచ్‌ అనిల్‌ కుమార్‌ బృందంలోని డాక్టర్‌ అబుబకర్‌, డాక్టర్‌ గిరి, నర్సులు సరళ, శ్రీలక్ష్మి, అసిస్టెంట్‌ విజయ్‌లను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement