● ప్రజానాడి పట్టిన ఎమ్మెల్యే డాక్టర్‌ సుధా | - | Sakshi
Sakshi News home page

● ప్రజానాడి పట్టిన ఎమ్మెల్యే డాక్టర్‌ సుధా

Mar 8 2026 7:41 AM | Updated on Mar 8 2026 7:41 AM

● ప్రజానాడి పట్టిన ఎమ్మెల్యే డాక్టర్‌ సుధా

ప్రజానాడి పట్టిన ఎమ్మెల్యేగా డాక్టర్‌ సుధా కీర్తిగడించారు. కడప పట్టణంలో గైనకాలజీ వైద్యురాలిగా గుర్తింపు పొందిన ఆమె అనూహ్యంగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. బద్వేల్‌ ఎమ్మెల్యేగా ఉన్న భర్త డాక్టర్‌ వెంకటసుబ్బయ్య మృతి చెందడంతో 2021లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆమె ఆపై తక్కువ కాలంలో ప్రజ ల మనస్సు గెల్చుకున్నారు. అదే ఏడాది అక్టోబర్‌ 30న జరిగిన ఉప ఎన్నికల్లో 90,533 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2024లో బద్వేల్‌ ఎమ్మెల్యేగా పోటీచేసిన ఆమె ప్రతికూల పరిస్థితుల్లో కూడా 18,567 ఓట్ల ఆధిక్యతతో మరోమారు విజయాన్ని సొంతం చేసుకున్నా రు. సున్నిత మనస్తత్వం అయినప్పటికీ ప్రజల సమస్యలపై గళం విప్పడంలో ఎమ్మెల్యే డాక్టర్‌ సుధా ఎప్పుడూ ముందువరుసలో ఉంటున్నా రు. ఇక రాజకీయ ఆరంగ్రేటం చేసిన తొలి ప్రయత్నంలోనే మాధవి రెడ్డి కడప ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పాలనాదక్షులుగా ఎప్పటికప్పుడూ మహిళలోకం నిరూపించుకుంటోంది. అలాగే జిల్లా ప్రిన్సిపల్‌, సెషన్స్‌ జడ్జి డాక్టర్‌ యామిని, వైఎస్సార్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా నిధిమీనా, రాజంపేట సబ్‌ కలెక్టర్‌ భావన విధి నిర్వహణలో సత్తా చాటుతుండడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement