భార్య కోసం భర్త ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

భార్య కోసం భర్త ఆత్మహత్యాయత్నం

Feb 22 2026 7:26 AM | Updated on Feb 22 2026 7:26 AM

భార్య కోసం భర్త ఆత్మహత్యాయత్నం

భార్య కోసం భర్త ఆత్మహత్యాయత్నం

చౌడేపల్లె : భార్య కోసం భర్త పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన ఘటన శనివారం రాత్రి చౌడేపల్లెలోని ఓ హోటల్‌ వద్ద చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అన్నమయ్య జిల్లా చౌడేపల్లె మండలం చిట్రెడ్డిపల్లెకు చెందిన పి.కృష్ణమూర్తికి, 17 యేళ్ల క్రితం సరోజమ్మ, మురగేష్‌ల కుమార్తె లలితకు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన భరత్‌ అనే 27 యేళ్ల యువకుడితో లలిత (40) ప్రేమాయణం సాగిస్తూ ఉండేది. ఈక్రమంలో లలిత భర్త పిల్లలను వదిలి భరత్‌ అనే యువకుడితో ఇంటి నుంచి వవెళ్లి పోయి గుడియాత్తం రామాలు సమీపంలోని గాంధీ నగర్‌లో సహజీవనం చేస్తున్నారు. ఇంతలో రెండు రోజుల క్రితం లలిత ఆమె కుటుంబ సభ్యులు ఫోన్‌ చేయడంతో.. కృష్ణమూర్తి గాంధీ నగర్‌కు వెళ్లడం, అక్కడ గొడవపడడం, గాయపర్చడం జరిగింది. అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లితే న్యాయం జరగకపోవడంతో కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామానికి వచ్చాడు. భరత్‌ వల్లనే తన భార్య తనకు దూరం అయిందని, న్యాయం చేయాలని చౌడేపల్లె పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లడంతో అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ నిర్లక్ష్యంగా మాట్లాడటంతో.. మనస్తాపం చెందిన కృష్ణమూర్తి పెట్రోల్‌ బంక్‌ సమీపంలో గల భరత్‌ తల్లిదండ్రులకు చెందిన హోటల్‌ ఎదుట పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. గమనించిన చుట్టుపక్కల వారు మంటలను అంటించుకోకుండా ఆపగలిగారు. జరిగిన ఘటన తీరును ప్రశ్నిస్తూ భరత్‌ కుటుంబ సభ్యులను నిలదీశారు. కృష్ణమూర్తి, కుటుంబ సభ్యులు, పిన్నమ్మ కమలతో కలిసి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. మాకు న్యాయం చేయాలని డిమాండు చేశారు. తనతోపాటు తమ కుటుంబ సభ్యులకు ప్రాణ హాని ఉందని, రక్షించాలని పోలీసులను వేడుకొంటూ బతిమలాడారు. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీస్‌ స్టేషన్‌తోపాటు హోటల్‌ వద్ద కొంత సేపు ఉద్రిక్తత నెలకొంది.

న్యాయం చేయాలని

పోలీస్‌స్టేషన్‌ ఎదుట బైఠాయింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement