ఒంటరి ఏనుగు హల్‌చల్
పులిచెర్ల(కల్లూరు): పులిచెర్లమండలంలో గురువారం రాత్రి ఒంటరి ఏనుగు హల్‌చెల్ చేసింది.గత కొన్ని నెలలుగా ఈ ప్రాంతంలోనే తిరుగుతూ రైతుల పొలాలపై పడి పంటలను నాశనం చేస్తోంది.దీన్ని ఇతర ప్రాంతాలకు తరమాలని ఫారెస్టు సిబ్బంది ప్రయత్నించినా ఫలితం లేదు.తాజాగా కల్లూరు పరిసర ప్రాంతాల్లో మామిడి తోటలపైపడి కొమ్మలను విరిచేసింది.
పీలేరు రూరల్: నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి ప్రయత్నించిన మైనర్ బాలుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ యుగంధర్ తెలిపారు. స్థానిక మదనపల్లె మార్గంలో గురువారం జరిగిన సంఘటనపై కాలనీలో సీఐ విచారణ శుక్రవారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలిక కుటుంబ సభ్యులు, ఇరుపొరుగు వారు ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో మైనర్ బాలుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాలుడు పరారీలో ఉన్నట్లు వివరించారు.
లక్కిరెడ్డిపల్లి: ఏపీ మోడల్ స్కూల్‌లో 2026– 27 విద్యాసంవత్సరానికి సంబంధించి ఆరోతరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ వరాల రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 23 నుంచి మార్చి 31వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎస్సీ, ఎస్టీలు రూ. 125, బీసీ, ఓసీలు రూ. 200 ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఏప్రిల్ 12వ తేదీ ఏపీ మోడల్ స్కూల్‌లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఏపీ మోడల్ స్కూల్‌లో అప్పగించాలన్నారు. వివరాలకు 77806 24220 నెంబర్‌లో సంప్రదించాలన్నారు.
రాయచోటి టౌన్: రాయచోటిలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలోని స్కిల్ హబ్ సెంటర్‌లో వెబ్‌డెవలపర్ ,సెక్యూరిటీ ఎనలిస్టులకు 3 నెలల ఉచిత శిక్షణ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ పి.శివశంకర్ శుక్రవారం పేర్కొన్నారు. వెబ్ డెవలెపర్ కోసం ఇంటర్ లేదా డిగ్రీ పాస్ అయిన వారు అర్హులని తెలిపారు. అలాగే సెక్యూరిటీ ఎనలిస్ట్‌ల కోసం కూడా వీరు తెలిపారు. మూడు నెలలు ఉచితంగా శిక్షణ ఇచ్చి తరువాత స్థానికంగా ఉన్న పరిశ్రమలతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఆసక్తి కలిగిన యువతీ యువకులు కళాశాలకు వచ్చి నేరుగా దరఖాస్తులు చేసు కోవచ్చున్నారు. వివరాలకు 9550104260నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం గజ్జెల మల్లారెడ్డి ట్రస్టు ఆధ్వర్యంలో ‘గజ్జెల మల్లారెడ్డి జీవన సాఫల్య పురస్కార ప్రదానోత్సవ సభ‘ ఈ నెల 21వ తేదీ కడపలోని వైవీయూ అన్నమాచార్య సేనెట్ హాల్లో నిర్వహించనున్నట్లు ట్రస్ట్ కన్వీనర్ ఆచార్య నల్లపరెడ్డి ఈశ్వరరెడ్డి తెలిపారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక పూర్వ సంపాదకులు కండ్లకుంట శ్రీనివాస్(2022–23 సంవత్సరానికి), ప్రజాశక్తి పూర్వ సంపాదకులు తెలకపల్లి రవి (2023–24), పలు పత్రికలకు సంపాదకులుగా పనిచేసిన సీనియర్ పాత్రికేయులు కె. రామచంద్రమూర్తి(2024–25)లకు గజ్జల మల్లారెడ్డి జీవన సాఫల్య పురస్కారం అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ సభకు యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి, గజ్జెల మల్లారెడ్డి ట్రస్టు అధ్యక్షులు ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ సభాధ్యక్షులుగా వ్యవహరిస్తారని తెలిపారు.
ఒంటరి ఏనుగు హల్‌చల్


