‘సోలార్’ సమస్యల పరిష్కారం కోసం ’1912’
కడప కార్పొరేషన్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని సోలార్ విద్యుత్ వినియోగదారులు సమస్యల పరిష్కారం కోసం టోల్–ఫ్రీ నంబరు–1912ను సంప్రదించవచ్చని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.సోలార్ విద్యుత్ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం వినియోగదారులు కాల్ సెంటర్‌కు కాల్ చేయడం ద్వారా ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. కాల్ సెంటర్లో సోలార్ సంబంధిత ఫిర్యాదులను కూడా నమోదు చేసే సౌకర్యాన్ని నూతనంగా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. వినియోగదారులు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్‌న్స్ సిస్టమ్ (ఐవీఆర్‌ఎస్) ద్వారా మొబైల్ ఫోన్ స్క్రీన్ పై 5 అంకెను నొక్కి సోలార్ విద్యుత్ ఫిర్యాదులను నమోదు చేయవచ్చని తెలిపారు. ఈ ఫిర్యాదు ఆధారంగా నిర్దిష్ట సమయంలోగా సంబంధిత సోలార్ పరికరాల విక్రేత సమస్యను పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందన్నారు. సమస్యను పరిష్కరించిన వెంటనే వినియోగదారునికి ఫీడ్ బ్యాక్ కాల్ చేస్తారని, వినియోగదారుడు ఇచ్చే ఫీడ్ బ్యాక్ కు అనుగుణంగా ఫిర్యాదును మూసివేయడం, తెరవడం జరుగుతుందన్నారు. సంస్థ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ ప్రకటనలో కోరారు.
తంబళ్లపల్లె: గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం, చిరుధాన్య పంటల సాగుపై విస్తృతంగా రైతులకు అవగాహన కల్పించాలని వెలుగు పీడీ నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం వెలుగు కార్యాలయంలో సెర్ప్ రైతు సాధికార సంస్థ(ఏపీ సీఎన్‌ఎఫ్) శాఖల సమన్వయంతో ఫుడ్ బాస్కెట్‌పై శిక్షణ ఇచ్చారు. జిల్లా యాంకర్ సునీతతో పాటు పద్మావతి, రుక్మిణిలు ఫుడ్ బాస్కెట్ కార్యాచరణ, అమలుచేసే తీరు, సామర్థ్యపెంపు తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. చిరుధాన్య పంటలతో తయారుచేసే పౌష్టికాహారం, వాటి ప్రయోజనాలు వివరించారు. కార్యక్రమంలో ఏపీఎం గంగాధర్, వీఓఎస్‌లు, కమిటీలు, సంఘమిత్రలు, ఎంఎస్‌ఏలు, సీసీలు పాల్గొన్నారు.


