ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు విచారణ
చౌడేపల్లె : మండల కేంద్రంలోని హైస్కూల్ వీధిలో చర్చి పక్కన ఉన్న పెయింట్ వ్యాపారి గంగాధరం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మదనపల్లె డీఎస్పీ మహేంద్ర మంగళవారం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును విచారణ చేశారు. పెయింట్ వ్యాపారిపై పెద్ద కొండామర్రికి చెందిన శ్రీదేవి, ఆమె అల్లుడు రాజేష్‌రెడ్డి, చిన్నకొండామర్రికి చెందిన చెంగళ్రాయప్పలు దాడి చేసి పెయింట్ డబ్బాలు తీసుకెళ్లడంతోపాటు షాప్‌నకు తాళాలు వేశారని అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకొని డీఎస్పీ విచారణ చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని ప్రవర్తిస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు. ఆయన వెంట సీఐ రాంభూపాల్, ఎస్‌ఐ నాగేశ్వరరావు ఉన్నారు.


