వన్యప్రాణుల విక్రయాల కేసులో ఏడుగురి అరెస్ట్
పీలేరు : వన్యప్రాణుల విక్రయాల కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు పీలేరు డీఎఫ్‌వో జయప్రసాద్‌రావు తెలిపారు. మంగళవారం స్థానిక ఫారెస్ట్ కార్యాలయంలో నిందితుల అరెస్ట్ చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక కడప రోడ్డులోని గోపీ ఫంక్షన్ హాల్‌లో 18.7 కేజీల బరువు గల అలుగు పొలుసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో కేవీపల్లెకు చెందిన రెడ్డెప్ప, చిన్నగొట్టిగొల్లుకు చెందిన రమణ, రేగళ్లుకు చెందిన చంద్రశేఖర్, కొత్తపల్లెకు చెందిన నాచూరి భాస్కర్, రాజ, పెనుమూరు మండలానికి చెందిన గోపి, పాలమందకు చెందిన రవి, కొత్తపల్లెకు సురేష్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ కేసులో ఫారెస్ట్ అధికారులు మామూళ్లు తీసుకుని ప్రధాన నిందితులను వదిలిపెట్టినట్లు వదంతులు వ్యాపిస్తున్నాయి.


