ఆ పరిశ్రమ మాకు వద్దు బాబోయ్‌! | - | Sakshi
Sakshi News home page

ఆ పరిశ్రమ మాకు వద్దు బాబోయ్‌!

Dec 4 2025 7:22 AM | Updated on Dec 4 2025 7:22 AM

ఆ పరిశ్రమ మాకు వద్దు బాబోయ్‌!

ఆ పరిశ్రమ మాకు వద్దు బాబోయ్‌!

మైలవరం : ఏదైనా పరిశ్రమను ఒక ప్రాంతంలో ఏర్పాటు చేయాలనుకుంటే దాని గురించి ఆ గ్రామాల ప్రజలకు సమాచారం ఇచ్చి స్థానికంగా గ్రామ సభ నిర్వహించి పరిశ్రమ ద్వారా ఆ ప్రాంత ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందో తెలియజేయాలి. పరిశ్రమపై ప్రజలకు ఉన్న అపోహలను తొలగించి వారి అంగీకారం మేరకే పరిశ్రమ ఏర్పాటు చేస్తారు. అయితే మైలవరం మండలం వద్దిరాల, దొడియం గ్రామ పంచాయతీల పరిధిలో ఏర్పాటు చేయబోయే సోలార్‌ పరిశ్రమపై కూటమి ప్రభుత్వం ఎందుకో ఈ పద్ధతిని పాటించలేదు. స్థానికులకు సమాచారం ఇవ్వకుండానే 1400 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏకంగా ఒక కంపెనీకి ఏకపక్షంగా కట్టబెట్టి చివరగా గ్రామ పంచాయతీలో తీర్మానాలను ఆమోదింపజేయాలని పంచాయతీ కార్యదర్శులపై కత్తిపెట్టింది. విధిలేని పరిస్థితుల్లో ఆ ఇరువురు గ్రామ పంచాయతీ కార్యదర్శులు సోలార్‌ పరిశ్రమ ఏర్పాటుపై గ్రామ పంచాయతీలలో తీర్మానాలు ప్రవేశపెట్టారు. గ్రామ సభ నిర్వహించకుండానే తాము ఎలా తీర్మానం ఆమోదిస్తామని విజ్ఞులైన ఆ ప్రజా ప్రతినిధులు తీర్మానం తిరస్కరించి వెనక్కి పంపారు. తామేమి పరిశ్రమకు వ్యతిరేకం కాదని అయితే తమ ప్రాంతంలో ఏర్పాటు కాబోయే సోలార్‌ పరిశ్రమ వల్ల తమ గ్రామాల్లో ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో, ఎంత మంది స్థానికులకు ఉపాధి కల్పిస్తారో స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే పరిశ్రమ ఏర్పాటుకు ఆమోదం తెలుపుతామని కరాఖండిగా చెప్పి పంపారు.

కొండంతా సోలార్‌ మయమే..

వద్దిరాల, దొడియం గ్రామాల మధ్యలో ఉన్న కొండ ప్రాంతం ఇక్కడి పల్లెల్లోని పేద ప్రజల జీవనానిక్ఙిశ్రీకొండంత అండగాశ్రీశ్రీ ఉండేది. అలాంటిది ఇప్పటికే కూటమి ప్రభుత్వం కొండల్లోని దాదాపు 4వేల ఎకరాల భూమిని మూడు సోలార్‌ కంపెనీలకు కట్టబెట్టింది. ఆయాన్‌, స్ట్రింగ్‌, అదాని కంపెనీలు తమకు కేటాయించిన భూముల చుట్టూ ముళ్ల కంచెవేసి దాదాపు 90 శాతం పనులు పూర్తి చేశాయి. ఇప్పడు కొండలో మిగిలి ఉన్న మరో 14 వందల ఎకరాల భూమిని అల్ట్రా సోలార్‌ కంపెనీకి కేటాయించారు. దీంతో ఈ ప్రాంత పేద ప్రజల జీవనోపాధికి గండి కొట్టడమే కాకుండా కొండంతా పూర్తి సోలార్‌ మయం కానుంది. ఇప్పటికై నా పశువుల మేత కోసం కొంత కొండ ప్రాంతాన్ని వదిలిపెట్టాలని ఇక్కడి ప్రజానీకం ముక్త కంఠంతో కోరుతున్నారు.

సోలార్‌ పరిశ్రమ ఏర్పాటుపై తీర్మానం వ్యతిరేకించిన రెండు గ్రామ పంచాయతీలు

పరిశ్రమ గురించి ప్రజలకు వివరించకుండానే తీర్మానం ఎలా ఆమోదిస్తామని నిలదీత

గ్రామ సభ నిర్వహించి స్థానికులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్‌

ఇప్పటికే 1400 ఎకరాలు కేటాయించి చివరలో పంచాయతీ తీర్మానం కోరిన సర్కారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement