జిల్లా ఫెన్సింగ్ అండర్–14 బాలబాలికల జట్ల ఎంపిక
గుర్రంకొండ : మండల కేంద్రమైన గుర్రంకొండలో జిల్లా అండర్–14 బాలికల ఫెన్సింగ్ జట్లను ఎంపిక చేశారు. బుధవారం స్థానిక తెలుగు జెడ్పీహైస్కూల్‌లో 69వ స్కూల్ గేమ్స్ జిల్లా ఫెన్సింగ్ అండర్–14 బాలబాలికల జట్ల సభ్యుల ఎంపిక పోటీలు నిర్వహించారు. జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి బాబు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి చంద్రశేఖర్‌ల ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి.
జిల్లా బాలుర జట్టు
ముషాహీద్‌రాజ్, సుల్తాన్, ముజకీర్, ముజ్మమీర్( తెలుగుజెడ్పీహైస్కూల్, గుర్రంకొండ), ఢిల్లీబాబు, పునీత్, జాన్‌లుక్ (జెడ్పీహైస్కూల్, కాణిపాకం), యశ్వంత్, కార్తికేయ, ఉమాశంకర్, సంజయ్(జెడ్పీహైస్కూల్, నరహరిపేట), ధర్మతేజ (జెడ్పీహైస్కూల్, మామండూరు)
జిల్లా బాలికల జట్టు
అర్చన, జ్యోత్స్న, జ్ఞానప్రసూన, సింధు (ఏపీ గురుకుల బాలికల పాఠశాల, గుర్రంకొండ), పల్లవి, ప్రసన్న (తెలుగుజెడ్పీహైస్కూల్, గుర్రంకొండ), నవ్యశ్రీ, శ్రావ్య (జెడ్పీహైస్కూల్, కాణిపాకం), దీపిక, తనూజ, ఆశాశ్రీ,రోస్లీన్, (జెడ్పీహైస్కూల్, నరహరిపేట)
జిల్లా అండర్–14 ఫెన్సింగ్ (కత్తిసాము)కు ఎంపికై న జట్లు నెల్లూరులో నిర్వహించే రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో మన జిల్లా తరపున పాల్గొంటారని ఖేలోఇండియా ఫెన్సింగ్ జిల్లా కోచ్ రవీంద్రనాథ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు సుబ్రమణ్యం, హెడ్మాస్టర్ తఖీవుల్లా, పీడీలు రాఘవ, కార్తీక్, శ్రావణి, పద్మలత పాల్గొన్నారు.


