పులివెందుల ప్రాంతానికి వైఎస్ కుటుంబం ఎనలేని సేవలు
పులివెందుల టౌన్ : పులివెందుల ప్రాంతానికి వైఎస్ కుటుంబం ఎనలేని సేవలు అందించి ప్రజల గుండెల్లో గూడు కట్టుకుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక భాకరాపుంలోని విజేత విభిన్న ప్రతిభావంతుల పాఠశాలలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పులివెందుల ప్రాంతంలో వైఎస్ భారతిరెడ్డి మానసిక దివ్యాంగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొనేందుకు విజేత విభిన్న ప్రతిభావంతుల పాఠశాలను ఏర్పాటు చేసి ఉచితంగా సేవలందించడం ఎంతో గొప్ప విషయమన్నారు.
పేద విద్యార్థులు, దివ్యాంగులపట్ల
వైఎస్ భారతిరెడ్డి ఔదార్యం
విజేత స్కూలులో అంతర్జాతీయ
దివ్యాంగుల దినోత్సవం
విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేసిన ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి


