నేటి నుంచి ఏసీఏ అండర్–14 జోనల్ మ్యాచ్‌లు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : నేటి నుంచి ఏసీఏ అండర్–14 నాలుగో విడత మ్యాచ్‌లు జరుగుతాయని జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు భరత్‌రెడ్డి, కార్యదర్శి రెడ్డి ప్రసాద్ తెలిపారు. వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో నార్త్ జోన్ విన్నర్స్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ నార్త్‌జోన్, కేఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో సౌత్‌జోన్ విన్నర్స్ వర్సెస్ సెంట్రల్ జోన్ విన్నర్స్, కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్ మైదానంలో రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ సౌత్‌జోన్ జట్లు తలపడతాయని తెలిపారు.
కత్తిసాము పోటీలో ప్రతిభ
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : చెన్నూరు మండలం రామనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి నాగ చైతన్య గట్కా(కత్తి సాము) ఎస్‌జీఎఫ్ అండర్ –19 బాల బాలికల విభాగంలో రాష్ట్ర స్థాయిలో మూడో స్థానంలో నిలిచి జాతీయ స్దాయికి ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయురాలు ఉమా మహేశ్వరి, ఫిజికల్ డైరెక్టర్ పోలంకి గణేష్ బాబు తెలిపారు. ఈ నెల 29,30 తేదీలలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన పోటీలలో ప్రతిభ కనబరిచాడు.


