ఇద్దరి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మండలంలోని సీటీఎం పంచాయతీ మిట్టపల్లెకు చెందిన రవీంద్రరెడ్డి(39)పై అతని భార్య తన నగలు మాయం చేశాడంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మనస్తాపం చెందాడు. సోమవారం పట్టణంలోని ఈశ్వరమ్మకాలనీ సమీపంలోని రైస్‌మిల్లు వద్ద పురుగుమందు తాగాడు. గమనించిన స్థానికులు బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా పట్టణంలోని బాలాజీ నగర్‌కు చెందిన సుభాష్(25) కుటుంబ సమస్యలతో మనస్తాపం చెంది ఇంటివద్దే విష ద్రావణం తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సంబంధిత పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
అదుపు తప్పి లారీ బోల్తా
పుల్లంపేట : స్థానిక బైపాస్ రోడ్డులో సోమవారం తెల్లవారుజామున అదుపుతప్పి లారీ బోల్తా పడింది. ఎర్రగుంట్ల నుండి చైన్నె వైపు సిమెంటు లోడుతో వెళుతున్న 16 టైర్ల లారీ బైపాస్‌లోని చెరువుకట్ట వద్దకు రాగానే వెనుక నుంచి అతి వేగంగా కారు వస్తుండడం, ఎదురుగా మరో లారీ రావడంతో కారును తప్పించబోయి లారీని పక్కకు తీయడంతో అదుపు తప్పి రోడ్డు పక్కనే బోల్తా పడింది. ఈ సంఘటనలో డ్రైవర్, క్లీనర్‌లకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.


