 
															వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీ వాయిదా
రాయచోటి : మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 28న నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ తలపెట్టిన నిరసన ర్యాలీ తుపాను కారణంగా వాయిదా పడినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి తెలిపారు. నిరసన కార్యక్రమాన్ని తిరిగి నవంబర్ 4న నిర్వహించనున్నట్లు సోమవారం తెలిపారు. పార్టీ నాయకులు, పార్టీ విభాగాల సభ్యులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు.
అర్జీలకు సత్వరమే పరిష్కారం
– జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన అర్జీలను పరిశీలించిర సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో అర్జీలను పరిశీలించి వేగంగా పరిష్కారం చూపాలన్నారు. అనంతరం కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్‌రావు, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, ఏడీ సర్వే భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా పల్లకీ సేవ
రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామికి సోమవారం పల్లకీ సేవ నిర్వహించారు.ముందుగా మూల విరాట్‌లు, ఉత్సవ మూర్తులకు అభిషేకాలు, పూజలు జరిపారు. రంగు రంగుల పూలు, పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించారు. అనంతరం ఉత్సవ మూర్తులను పల్లకీలో కొలువుదీర్చి ఆలయ మాఢవీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో స్థానికులతో పాటు కన్నడ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
జాతీయస్థాయి అథ్లెటిక్స్‌కు ఎంపిక
నందలూరు : మండలంలోని మహాత్మా జ్యోతి భా పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో సెకండియర్ ఎంపీసీ చదువుతున్న ఎస్.నిత్య ఏలూరులో జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో ప్రతిభ కనబరిచారు. డిస్క్‌త్రో, షాట్‌పుట్ విభాగంలో హర్యానాలో జరిగే జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపల్ నాగేశ్వరి తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ ఫస్టియర్ సీఈసీ చదువుతున్న కె.మానస రాష్ట్ర స్థాయి పోటీల్లో కాంస్య పతకాన్ని సాధించిందని, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందని తెలిపారు. విద్యార్థినులకు శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయురాలు కె.జి సునీతను ఉపాధ్యాయులు, అధ్యాపకులు అభినందించారు.
గుంటిమడుగు
పెద్ద చెరువుకు గండి
రాయచోటి : రాయచోటి రూరల్ మండలం గుంటిమడుగు సమీపంలోని పెద్ద గోలాన్ చెరువుకు భారీ గండి పడింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోలాన్ చెరువులోకి వర్షపునీరు చేరింది. సోమవారం మధ్యాహ్నం గండిపడిన ప్రాంతాన్ని గుర్తించి అధికారులకు సమాచారం అందజేశారు. అధికారులు స్పందించి గండి పడిన ప్రాంతంలో మరమ్మతులు చేపట్టారు.
కడప కోటి రెడ్డి సర్కిల్ : మోంథా తుపాను నేపథ్యంలో కడప నుంచి విశాఖపట్నం వెళ్లేతిరుమల ఎక్స్‌ప్రెస్ రైలును మంగళవారం రద్దు చేసినట్లు కడప రైల్వే కమర్షియల్ ఇన్స్‌పెక్టర్ జనార్ధన్ తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు
 
							వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీ వాయిదా
 
							వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీ వాయిదా

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
