 
															1న అండర్–19 ఖోఖో జిల్లా జట్ల ఎంపిక
మదనపల్లె సిటీ: ఉమ్మడి చిత్తూరు జిల్లా అండర్–19 బాల,బాలికల ఖోఖో జట్ల ఎంపిక నవంబర్ 1వతేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ బాబు తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ ఎంపిక జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు పార్థసారధి 9866673132ను సంప్రదించాలని కోరారు.
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయంలో నవంబర్ 7వ తేదీన అంతర కళాశాలల క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఆ విశ్వవిద్యాలయ వ్యాయామ విద్య, క్రీడా శాస్త్రాల బోర్డు కార్యదర్శి డా.రామసుబ్బారెడ్డి తెలిపారు. రోలర్ స్కెటింగ్ , రైఫిల్ షూటింగ్ ,యోగ ,టేబుల్ టెన్నిస్ విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. క్రీడాకారుల వయసు 17 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలని సూచించారు. ఈ పోటీల్లో పాల్గొనదలచిన క్రీడాకారులు ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్, టెన్త్, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్‌లు, వీటిలో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపిలపై ప్రిన్సిపల్ తో అటెస్టేషన్ చేయించుకుని రావాలని పేర్కొన్నారు.
ఒంటిమిట్ట: మండల కేంద్రంలోని పీహెచ్‌సీని గురువారం వైఎస్సార్ కడప జిల్లా వైద్యాధికారి(డీఎంహెచ్‌ఓ) డాక్టర్ నాగరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలో రిజిస్టర్ అయిన రోగుల వివరాలను ఆయన పరిశీలించి, ఆసుపత్రిలో ఉన్న రోగులతో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. అలాగే స్థానిక ఒంటిమిట్ట జెడ్పీహెచ్‌ఎస్‌లో జరుగుతున్న రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమాన్ని, పాఠశాలలో ఉన్న ఆర్‌ఓ ప్లాంట్, మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డీఎస్‌కే, ఎన్‌సీడీసీడీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, మండల వైద్యాధికారి డాక్టర్ భావన, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.సి రవీంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.
రాజంపేట టౌన్: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని రాష్ట్ర స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ అధికారి, రాష్ట్ర ప్రాంతీయ వ్యాయామ విద్య తనిఖీ అధికారి (ఆర్‌ఐపీ) జి.భానుమూర్తిరాజు తెలిపారు. పట్టణంలోని జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ఐ డివిజన్ స్థాయి కబడ్డీ, యోగా పోటీలను రాజంపేట, పుల్లంపేట మండలాల ఎంఈఓలు కొండూరు రఘునాథరాజు, జి.చక్రధర్‌రాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్‌ఐపీ మాట్లాడారు. ఎస్‌జీఎఫ్‌ఐ డివిజన్ కో–ఆర్డినేటర్ హమీద్, వాలీబాల్ కోచ్, రిటైర్డ్ పీడీ ఎస్.షామీర్‌బాషా, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సిద్దవటం: మండలంలోని జంగాలపల్లె, పెద్దపల్లి గ్రామాల్లోని గోకులం షెడ్లను గురువారం డ్వామా పీడీ ఆదిశేషారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన జంగాలపల్లె గ్రామంలో ఇంటింటా జరుగుతున్న హార్టీకల్చర్ సర్వేను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇచ్చిన గడువులోపు సర్వేని పూర్తి చేయాలన్నారు. అలాగే బాకరాపేట గ్రామంలోని రైతు పుత్తా రామచంద్రయ్యకు, చెందిన హార్టీకల్చర్ ప్లాంటేషన్‌ను పరిశీలించారు. ప్రభుత్వం పాడి రైతులకు పశువుల రక్షణ కోసం మినీ గోకులం షెడ్లను మంజూరు చేస్తుందన్నారు. సిద్దవటం మండలం ఉపాధిహామీ ఏపీఓ నరసింహులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, సీసీలు పాల్గొన్నారు.
 
							1న అండర్–19 ఖోఖో జిల్లా జట్ల ఎంపిక
 
							1న అండర్–19 ఖోఖో జిల్లా జట్ల ఎంపిక

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
