 
															2న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాక
కడప సెవెన్‌రోడ్స్: నవంబర్ 2 తేదీ సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో జరిగే బ్రౌన్ శాస్త్రి శతజయంతోత్సవ వేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రానున్న నేపథ్యంలో ప్రోటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో అధికారిక ఏర్పాట్ల పై కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జేసీ అదితి సింగ్, ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జానమద్ది సాహితీ పీఠం ఆధ్వర్యంలో సి పి బ్రౌన్ ప్రాంగణంలో నిర్వహించనున్న గ్రంథాలయ సాహిత్య సేవా పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొంటారని తెలిపారు. ఆయన బస చేయనున్న ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద మెడికల్ టీం ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రొటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లను పాటించాలని పేర్కొన్నారు.
● ప్రోటోకాల్ మేరకు ఏర్పాట్లు
● కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
