యూనివర్సిటీ తరలింపుపై స్టే | - | Sakshi
Sakshi News home page

యూనివర్సిటీ తరలింపుపై స్టే

Oct 31 2025 7:55 AM | Updated on Oct 31 2025 7:55 AM

యూనివర్సిటీ తరలింపుపై స్టే

యూనివర్సిటీ తరలింపుపై స్టే

యూనివర్సిటీ తరలింపుపై స్టే

కోర్టు స్టే

వల్లూరు: డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్శిటీ తరలింపుపై హైకోర్టు స్టే విధించింది. ఈ యూనివర్శిటీ ఏర్పాటైనప్పటి నుంచి కడప నగర సమీపంలోని శ్రీనివాస ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వారి భవన సముదాయంలో నడుస్తోంది. ప్రస్తుత ఆర్కిటెక్చర్‌ యూనివర్శిటీ వీసీ జయరామిరెడ్డి బాధ్యతలు స్వీకరించిన అతి కొద్ది రోజుల్లోనే ఈ యూనివర్శిటీని వైవీయూ ప్రాంగణంలోని 21 వ శతాబ్దం గురుకులంలోకి తరలించాలని నిర్ణయం తీసుకున్నారు.

నిజానికి శ్రీనివాస ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వారి భవన సముదాయంలో ఆర్కిటెక్చర్‌ యూనివర్శిటీ నిర్వహణకు సంబంధించి 2024 డిసెంబర్‌లో అగ్రిమెంట్‌ ముగిసింది. ఈ క్రమంలో తమ భవనాలను ఖాళీ చేయాలని యాజమాన్యం జనవరిలో యూనివర్శిటీ వారికి నోటీసులు అందచేసింది. వైవీయూలో ఈ యూనివర్శిటీ నిర్వహణకు కేవలం 4 భవనాలు మాత్రమే అందుబాటులో ఉన్న కారణంగా యూనివర్శిటీ వారు ఇక్కడే కొనసాగించడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఈ నెల 22 న తమ అగ్రిమెంట్‌ను రెన్యువల్‌ చేయాలని యాజమాన్యం యూనివర్సిటీని కోరింది. ఈ క్రమంలో తాము ఈ నెల 31లోపు యూనివర్శిటీని తరలిస్తున్నట్లు 24 వ తేదీ రాత్రి మెయిల్‌ ద్వారా యాజమాన్యానికి తెలియచేసింది. తమకు ఇప్పటి వరకు ఇవ్వాల్సిన అద్దె బకాయిలను చెల్లించాలని, అగ్రిమెంట్‌ నిబంధనల మేరకు మూడు నెలల ముందు నోటీస్‌ ఇచ్చిన తరువాత ఖాళీ చేయాలని యాజమాన్యం తెలిపింది.

కాగా లీజు అగ్రిమెంట్‌కు సంబంధించి మూడు నెలల ముందు నోటీసు ద్వారా తెలపకపోవడంతో బాటు, తమకు చెల్లించాల్సిన సుమారు రూ 3.5 కోట్ల బకాయిలు చెల్లించకుండా యూనివర్సిటీని తరలించాలని నిర్ణయించడంపై శ్రీనివాస ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో సదరు కోర్టు వారం రోజుల పాటు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రస్తుతానికి యూనివర్శిటీ తరలింపుకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement