మోంథా ప్రభావిత పంటల పరిశీలన
సిద్దవటం : మండలంలోని టక్కోలు, ఖాజీపల్లి, డేగనవాండ్లపల్లి, లింగంపల్లి, కడపాయపల్లె గ్రామాలలో మోంథా తుపాను కారణంగా దెబ్బతిన్న వరి, మినుము పంటలను ఊటుకూరు వ్యవసాయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు డా.కె.సునీల్‌కుమార్, డా.మాధురి, డా.యాస్మిన్, కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డా.అంకయ్యకుమార్, ఏరువాక కేంద్ర శాస్త్రవేత్త డా.కృష్ణప్రియ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొలంలో పడిపోయిన వరి కంకుల నుంచి గింజలు మొలకెత్తకుండా 50 గ్రాముల కల్లు ఉప్పు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. పాలు పోసుకునే దశలో ఉన్న వరి పైరులో నల్లగింజ, పొట్టకుళ్లు, మానిపండు తెగుళ్లు రాకుండా ఉండటానికి ప్రోఫినోకోనజల్ 400 గ్రాములు ఎకరాకు పిచికారీ చేయాలని తెలిపారు. మినుము పంటలో నిల్వ ఉన్న నీటిని తీసేసి లద్దెపురుగు, ఆకు మచ్చ తెగుళ్లు రాకుండా పోరా ట్రానిజల్ ప్రోల్ 60 విహహైక్సక్రోనోజోల్ 40 మిలీ, 13:0:45, వెయ్యి గ్రాములు మందు ఎకరాకు పిచికారీ చేయాలని తెలిపారు. తేమ అధికంగా ఉన్నపుడు బ్రాండ్ల ద్వారా పిచికారీ చేసుకుని పురుగులు, తెగుళ్లను నివారించచుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి రమేష్‌రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి ప్రభాకర్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
వర్షానికి కూలిన ఇల్లు
జమ్మలమడుగు: మోంథా తుపాను ప్రభావంతో పెద్దముడియం మండలం పాలూరు గ్రామంలో కాచన రమణారెడ్డి, పుల్లమ్మ నివాసం ఉన్న ఇల్లు కూలిపోయింది. చౌడుమిద్దె కావడంతో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి తడిసింది. ఒక్కసారిగా ఆర్థరాత్రి సమయంలో ఇల్లు కూలింది. అయితే రమణారెడ్డి, పుల్లమ్మ ఇంట్లో కాకుండా సోఫాలు నిద్రించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. కూలిన శబ్దం కావడంతో స్థానికులు వచ్చి భార్య, భర్తలను క్షేమంగా బయటికి తీసి సురక్షిత ప్రాంతానికి తరలించారు.
కూలిన ప్రహరీ పరిశీలన
సుండుపల్లె : మండలకేంద్రంలోని పురాతన శివాలయం ప్రహరీ మోంథా తుపాను ధాటికి కురిసిన వర్షాలకు కూలింది. అన్నమయ్య జిల్లా దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారి కొండారెడ్డి కూలిన ప్రహారీని బుధ వారం పరిశీలించారు. ప్రహరీ కూలడంతో ఆలయ ఆవరణలోకి వివిధ జంతువులు వస్తున్నాయని, ఆలయ పరిసరాలు అపరిశుభ్రమవుతున్నాయని భక్తులు అధికారికి విన్నవించారు. అంతకు ముందు ఆయన విరూపాక్ష స్వామిని దర్శించుకున్నారు.
పెన్నా వద్ద పటిష్ట బందోబస్తు
సిద్దవటం : ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు పెన్నా నదికి వరద నీరు పోటెత్తడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. లో లెవల్ కాజ్‌వేకు ఇరువైపులా రహదారులకు జేసీబీ యంత్రాలతో అడ్డుకట్ట వేశారు. ఎస్‌ఐ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ పెన్నానదిలో వరద నీరు పెరిగిందని, చేపల వేటకు వెళ్లే జాలర్లు నదిలోకి వెళ్లరాదన్నారు. కొత్త వ్యక్తులు సంచరిస్తే సమాచారం తెలపాలని ఎస్‌ఐ పేర్కొన్నారు.
మోంథా ప్రభావిత పంటల పరిశీలన


