మైనర్ బాలిక కేసులో నిందితుడి అరెస్టు
కేవీపల్లె : మైనర్ బాలిక ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చిన కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ చిన్నరెడ్డెప్ప తెలిపారు. ఎస్‌ఐ వివరాల మేరకు.. మండలంలోని బసన్నగారిపల్లెకు చెందిన మైనర్ బాలిక(16) తండ్రి అనారోగ్యంతో ఉన్నాడు. తల్లి జీవనోపాధి కోసం కువైట్‌కు వెళ్లింది. ఇదే అదునుగా భావించిన అదే గ్రామానికి చెందిన నరేంద్ర అలియాస్ నాని(22) ఒంటరిగా ఉన్న మైనర్ బాలికను లోబరచుకుని లైంగిక దాడికి పాల్పడాడు. దీంతో మైనర్ బాలిక గర్భం దాల్చింది. ఈ నెల 7న పురిటి నొప్పులు రావడంతో పీలేరులోని మాధవి అస్పత్రికి తరలించారు. 8న కాన్పు చేయడంతో మగబిడ్డకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు బిడ్డను స్వాధీనం చేసుకుని రాయచోటి శిశుసంక్షేమ శాఖ కార్యాలయానికి తరలించారు. ఐసీడీఎస్ సీడీపీవో రాజమ్మ ఫిర్యాదు మేరకు వరుసకు అన్న అయిన నాగేంద్ర మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారని, డాక్టర్‌మాధవి పోలీసులు, ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇవ్వలేదని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. నిందితుడు నరేంద్రను బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్‌ఐ తెలిపారు.


