 
															● పింఛా ప్రాజెక్టు పరిశీలన
సుండుపల్లె : మండల పరిధిలోని పింఛా ప్రాజెక్టును జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రాజెక్టు దిగువున ఉన్న నదీ పరివాహక ప్రాంతాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడకి వచ్చే సందర్శకులకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చి జాగ్రత్తలు పాటించేలా చూడాలని సిబ్బందికి సూచించారు. నదీ పరీవాహక ప్రాంతాల రైతులు, ప్రజలు తుపాను ప్రభావంతో ప్రాజెక్టు నుంచి దిగువ ప్రాంతానికి నీరు వదలడంతో ప్రవాహం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ ముత్యాల శ్రీనివాసులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
