అధిక నీటి ప్రవాహంపై అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

అధిక నీటి ప్రవాహంపై అప్రమత్తం

Oct 28 2025 7:46 AM | Updated on Oct 28 2025 7:46 AM

అధిక నీటి ప్రవాహంపై అప్రమత్తం

అధిక నీటి ప్రవాహంపై అప్రమత్తం

బి.కొత్తకోట : హంద్రీ–నీవా పుంగనూరు ఉపకాలువలో అదనపు నీటి ప్రవాహంపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ అదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్‌ బి.కొత్తకోట మండలంలోని గుమ్మసముద్రం చెరువును పరిశీలించారు. చెరువు నిండి మొరవనీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవడంతోపాటు అప్రమత్తంగా పని చేయాలని రెవెన్యూ, జలవనరులశాఖ అధికారులను ఆదేశించారు. చెరువు కుడిమొరవ నుంచి ప్రవహిస్తున్న నీళ్లు సమీపంలోని హంద్రీ–నీవా కాలువలోకి వెళ్తుండటంతో అదనపు నీళ్లతో కాలువ సామర్థ్యం పెరిగిపోయి మళ్లీ కాలువ తెగే పరిస్థితులు ఉంటాయని సూచించారు. దీనికి ముందుస్తుగా కిలోమీటర్‌ 108 వద్ద కాలువలోకి అదనపు వర్షం నీరు లేదా చెరువునీళ్లు చేరితే బయటకు వెళ్లేలా కాలువ అంచున నీటి ప్రవహం మళ్లేలా ఎస్కేప్‌ ఏర్పాటు చేశామని ఎస్‌ఈ విఠల్‌ప్రసాద్‌, ఈఈ అమరనాథ్‌రెడ్డిలు కలెక్టర్‌కు వివరించారు. కాగా గుమ్మసముద్రం చెరువు వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని తహశీల్దార్‌ బావాజాన్‌ను కలెక్టర్‌ ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement