 
															పోలీసు వ్యవస్థపై విశ్వాసం పెంచాలి
పుల్లంపేట : పోలీసుల పనితీరు తమ పట్ల ప్రజల్లో విశ్వాసం పెంచేలా ఉండాలని ఏఎస్పీ మనోజ్ రాంనాథ్‌హెగ్డే అన్నారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల సానుకూలంగా వ్యవహరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. రాత్రివేళల్లో గస్తీ ముమ్మరం చేయాలన్నారు. కేసుల పరిష్కారంలో సాంకేతికతను ఉపయోగించుకోవాలన్నారు. ఫిర్యాదుల పట్ల అలసత్వం వహించరాదన్నారు. అలాగే స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం ఇటీవల రశ్రీరాములపేట గ్రామంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ విషయమై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసు గురించి గ్రామానికి వెళ్లి విచారణ చేశారు. కొత్తపేట సర్పంచ్ మణికంఠను అడిగి గొడవకు దారి తీసిన కారణాలపై ఆరా తీశారు. ఏఎస్పీ వెంట రాజంపేట రూరల్ సీఐ రమణ, ఎస్‌ఐ శివకుమార్ ఉన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
